బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. రోహిత్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. రోడ్డు ప్రమాదంతో ఆటకు కొన్నాళ్లు దూరమైన పంత్ 21 నెలల తర్వాత తిరిగి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన కోహ్లి కూడా తిరిగి రెడ్ బాల్ క్రికెట్‌కు అందుబాటులోకి వచ్చాడు.
అయితే ప్రకటించిన టీమిండియాపై నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ స్పష్టంగా కనిపించింది. గంభీర్ వ్యూహాలను అనుసరిస్తూ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. ఈ క్రమంలో టీమిండియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన టాప్-5 ఆటగాళ్లు గురించి ఓ లుక్ వేద్దాం.

శ్రేయస్ అయ్యర్
రంజీ ట్రోఫీలో ఆడకపోవడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురై జట్టులో చోటుతో పాటు శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అయితే లంకతో వన్డే సిరీస్‌కు తిరిగి ఎంపికయ్యాడు. అంతేగాక దులీప్ ట్రోఫీలో ఇండియా-డీకి సారథిగా ఎంపికయ్యాడు. కానీ షార్ట్ పిచ్ బంతులకు వికెట్లను సమర్పించుకునే బలహీనతను శ్రేయస్ అధిగమించలేకపోతున్నాడు. ఇటీవల జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్‌లోనూ అదే రీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో నిలకడై ప్రదర్శనతో ఆకట్టుకున్న తర్వాతే శ్రేయస్‌కు ఛాన్స్ ఇవ్వాలనే యోచనలో సెలక్టర్లు-గంభీర్ ఉన్నారు.
రజత్ పటిదార్
ఇంగ్లండ్ సిరీస్‌కు రజత్ పటిదార్ ఎంపికయ్యాడు. కానీ నిరాశపరిచాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 63 పరుగులే చేశాడు. కానీ ఐపీఎల్-2024లో రజత్ సత్తాచాటాడు. స్పిన్‌ను ధీటుగా ఎదుర్కొనే ఈ యువ బ్యాటర్ దులీప్ ట్రోఫీలోనూ ఫర్వాలేదనిపిస్తున్నాడు. దీంతో అతనికి మరో ఛాన్స్ ఇస్తారని భావించారంతా. కానీ కోహ్లి, రాహుల్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో రజత్‌ను పక్కనపెట్టారు.
వాషింగ్టన్ సుందర్
బ్యాటుతో పాటు బంతితో గొప్పగా రాణించే సుందర్ జట్టులో విలువైన ప్లేయర్. కానీ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్లు జట్టులో ఉండటంతో సుందర్‌ను పక్కనపెడుతున్నారు. గత ఇంగ్లండ్ సిరీస్‌కు సుందర్ ఎంపికైనప్పటికీ.. అతన్ని బీసీసీఐ రిలీజ్ చేసింది. రంజీట్రోఫీ సెమీఫైనల్స్ ఆడాలని సూచించింది. టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో సుందర్‌కు అవకాశం దక్కని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి జట్టులో కూడా ఎంపికకాలేదు.
కేఎస్ భరత్
రోడ్డు ప్రమాదానికి గురై పంత్ ఆటకు దూరమవ్వడంతో కేఎస్ భరత్‌కు అవకాశాలు వరుసగా వచ్చాయి. వికెట్ల వెనుకు నిల్చుని ప్రత్యర్థి ఔటవ్వడంలో కీలకపాత్ర పోషించే భరత్.. బ్యాటుతో మాత్రం నిరాశపరుస్తున్నాడు. అయిననప్పటికీ బ్యాకప్ వికెట్ కీపర్‌గా భరత్‌కు మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని భావించారంతా. కానీ ధ్రువ్ జురెల్ నిలకడైన ప్రదర్శనతో భరత్‌కు సెలక్టర్లు బైబై చెప్పారు.
ముకేశ్ కుమార్
2023లోనే ముకేశ్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. కానీ నిలకడైన ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ముకేశ్ ఇప్పటివరకు మూడు టెస్టులు మాత్రమే ఆడారు. అతనికి మరికొన్ని అవకాశాలు ఇస్తే రాటుదేలుతాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ముకేశ్‌కు బదులుగా ఫామ్‌లో ఉన్న ఎడమచేతి వాటం పేసర్ యశ్ దయాల్‌కు గంభీర్-సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. జట్టులో లెఫ్టార్మ్ బౌలర్ ఉండటం కలిసొస్తుందని భావించారు.