Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారిద్దరిపై వేటు.. గౌతమ్ గంభీర్ సహాయక సిబ్బంది ఇదే!

భారత క్రికెట్ కోచింగ్‌లో వరల్డ్ కప్ విజేత, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శకం మొదలైంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్‌ని బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని మంగళవారం అధికారింకగా వెల్లడించింది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీరే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ఆది నుంచే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆ అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి.

ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ యాక్షన్ మొదలుకానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కోచ్ పదవిలో ఉంటాడు. అప్పటివరకు భారత అయిదు ఐసీసీ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే 2025లోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంటుంది. 2026లో టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2027లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే మహా సమరం జరుగుతాయి.

Gautam Gambhir Welcomes New Support Staff Abhishek Nayar as Batting Coach and T Dilip Continues as Fielding Coach

అయితే సహాయక సిబ్బంది ఎంపికలో తనకు స్వేచ్ఛను ఇవ్వాలని బీసీసీఐని నయా కోచ్ గంభీర్ కోరాడు. దీనికి బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌ కోచ్ అభిషేక్ నాయర్‌ను టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా గంభీర్ ఎంపిక చేసినట్లు సమాచారం. కేకేఆర్ తరఫున గత ఐపీఎల్ సీజన్‌లోనూ వీరిద్దరు కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. టీమిండియా బాధ్యతల నిర్వహణపై వీరిద్దరు ఓ అంచనాకు కూడా వచ్చారని తెలిసింది. దీంతో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్‌కు నిరాశే మిగలనుంది.

ఇక ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ను కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఫీల్డింగ్ అత్యున్నత దశకు చేరుకోవడానికి దిలీప్ ఎంతో శ్రమించాడు. దీంతో దిలీప్‌ను తన సహాయక సిబ్బందిగా కొనసాగించాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా బౌలింగ్ కోచ్ పరాజ్ మాంబ్రేను కొనసాగించే ఉద్దేశం గంభీర్‌కు లేదని సమాచారం. బౌలింగ్ కోచ్‌గా వినయ్ కుమార్ పేరు ప్రతిపాదనలో ఉంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజేత అయిన గంభీర్ ఐపీఎల్‌లో 2012, 2014లో సారథిగా కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. అయితే సక్సెఫుల్ కెప్టెన్‌గానే కాకుండా మెంటార్‌గానూ గంభీర్ ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో మెంటార్‌గా గంభీర్‌ది కీలకపాత్ర. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ దూకుడు ఫార్ములాతో జట్టును సిద్ధం చేయడంలో గంభీర్ నేర్పరి.

Story first published: Wednesday, July 10, 2024, 9:06 [IST]
Other articles published on Jul 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+