శుభవార్త: గౌతం గంభీర్‌కి కూతురు పుట్టింది
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ మరోసారి తండ్రయ్యాడు. గంభీర్ భార్య పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని గంభీర్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
'మముల్ని దీవించేందుకు మా కుటుంబంలోకి మరో యువరాణి అడుగుపెట్టింది. ఆమె రాకతో మా జీవితంలో వెలుగులు నిండాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువరాణికి స్వాగతం' అని గంభీర్ పేర్కొన్నాడు. 2011లో గంభీర్ నటాషాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరికి తొలుత పుట్టిన ఆడ పిల్లకు ఆజీన్ అని పేరు పెట్టారు. చిన్న పాపను ఆజీన్ ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫొటోను గంభీర్ ట్విటర్‌లో ఉంచాడు. ఈ సందర్భంగా క్రీడాకారులు, అభిమానులు గంభీర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం విండిస్ పర్యనటలో ఉన్న కెప్టెన్ కోహ్లీతో పాటు ఇర్ఫాన్ పఠాన్ తదితరులు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ 2012, 2014లో విజేతగా నిలిచింది. కాగా, పదో సీజన్‌లో కోల్‌కతా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో 16 మ్యాచ్‌లాడిన గంభీర్ 498 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications