For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషబ్ పంత్ చెత్త షాట్ పట్ల మాజీ క్రికెటర్ల అసహనం.. ఆ టైంలో ఆ షాట్ కరెక్ట్ కాదంటూ హితవు

Gautam Gambhir, Wasim Akram and Ravi Shastri Comments About Pant Shot Selection

ఆసియా కప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4మ్యాచ్‌లో రిషబ్ పంత్ చెత్త షాట్ కొట్టి క్యాచ్ ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఇక పంత్ షాట్-సెలక్షన్‌ను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పుపట్టారు. పంత్ 12బంతుల్లో 14పరుగులు చేసి ఔటయిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ మరో ఎండ్‌లో స్థిరపడి ఆడుతుండగా.. రిషబ్ పంత్‌ అవతలి ఎండ్‌లో హిట్టింగ్ మూమెంటమ్ కొనసాగించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అతను పాయింట్ రీజియన్లో స్విచ్ హిట్ ఆడేందుకు ప్రయత్నించగా పాయింట్లో ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ తెలివిగా బౌలింగ్ చేసి పంత్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఫ్లైయింగ్ స్టార్ట్ అందించిన తర్వాత 10వ ఓవర్ లోపల సూర్యకుమార్ యాదవ్‌‌ వికెట్ కూడా భారత్ కోల్పోయింది. తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యతను పంత్ చేపట్టాల్సిన సమయంలో అతను పూర్తిగా నిరాశపరిచాడు. పంత్ తాను క్రీజులో ఉన్న టైంలో అంత కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. అతను ఔటయిన విధానం సోషల్ మీడియాలోనూ బాగా విమర్శలకు గురయింది. ఇక అనుభవశీలుడైన వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన దినేష్ కార్తీక్‌‌
ను కాదని పంత్‌కు ప్రాధాన్యత ఇస్తే అతను ఇలా చేయడంతో రోహిత్ శర్మ సైతం కాస్త సీరియస్‌గా కన్పించాడు. ఆగస్టు 28న పాకిస్తాన్‌తో జరిగిన భారత ఆసియా కప్ ఓపెనర్‌లో పంత్‌ని ప్లేయింగ్ 11లో కూడా తీసుకోలేదు. అయితే రవీంద్ర జడేజాకు గాయం కావడంతో భారత్ టాప్ సిక్స్‌లో లెఫ్టాండర్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్న టీం మేనేజ్‌మెంట్ పంత్‌‌ను తుది జట్టులోకి తీసుకుంది. 'రిషబ్ పంత్ నిరాశ చెందుతాడు.. ఎందుకంటే అది పంత్ కొట్టాలిసిన షాట్ కాదు, అతను ఆ షాట్‌ను లాంగ్ ఆన్ లేదా డీప్ మిడ్ వికెట్ మీద కొట్టాల్సింది. అయితే అసలే స్విచ్ హిట్ ఆడొద్దనట్లేదు. పంత్ స్విచ్ హిట్లు ఆడగలడు. కానీ ఈ టైంలో ఆ షాట్ ఆడడం సరికాదు' అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, కామెంటేటర్ రవిశాస్త్రి సైతం రిషబ్ పంత్ షాట్‌ను తప్పుపట్టారు. గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలను సమర్థించారు. మిడిల్ ఓవర్లలో స్విచ్ హిట్‌ను ఆడకుండా పంత్ ఉండాల్సిందని చెప్పారు. 'గంభీర్ ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. టెస్టు క్రికెట్‌లో అతను ఆ షాట్ ఆడతాడని నాకు తెలు. అతను ప్రపంచ క్రికెట్‌లోని టాప్ ప్లేయర్‌లలో ఒకడని కూడా తెలుసు, కానీ ఈ దశలో ఇలాంటి షాట్ అవసరం లేదు' అని వసీం అక్రమ్ చెప్పాడు. పంత్ ఇంకాసేపు ఓపిక పట్టాల్సింది అంటూ రవిశాస్త్రి చెప్పాడు.

Story first published: Monday, September 5, 2022, 15:58 [IST]
Other articles published on Sep 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+