Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్‌ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవాడు: మాజీ కోచ్ సంచలన వ్యాఖ్య

Gautam Gambhir Was Insecure, Negative And Pessimistic, Coach Paddy Upton In New Book

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గంభీర్‌ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవాడని, 150 పరుగులు చేసినా సంతోషంగా ఉండేవాడు కాదని టీమిండియా మాజీ మానసిక కోచ్‌ ప్యాడీ అప్టన్‌ పేర్కొన్నాడు. ఇటీవలే ఆయన రాసిన "ది బేర్‌ఫుట్ కోచ్" అనే పుస్తకంలో ఆటగాళ్ల మానసిక దృఢత్వం, సందర్భాన్ని బట్టి వాళ్లు ఎలా వ్యవహరించారనే విషయాలను పొందుపరిచారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సందర్భంగా గంభీర్, ధోనిల గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గంభీర్‌ ఓ నిరాశవాది అని, ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవాడని ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. అంతేకాదు గంభీర్ మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి తాను చాలా ప్రయత్నాలు చేసినట్లు అందులో పేర్కొన్నాడు.

2009లో గంభీర్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యేంతవరకూ కష్టపడ్డానని, ఇంకొంచం శ్రమించి ఉంటే, ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌ అయ్యేవాడని అన్నాడు. కోచ్ గ్యారీ కిరెస్టన్, తాను ఎంతకష్టపడినప్పటికీ గంభీర్ నిరాశగా, అభద్రతా భావంతో ఉండేవాడని ఉండేవాడని ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు.

గంభీర్ సెంచరీ సాధించినా, తృప్తి ఉండేది కాదని.. ఎప్పుడు అతను తాను చేసిన తప్పులను గుర్తు చేసుకొని ఆవేదన చెందేవాడని ప్యాడీ అప్టన్‌ తెలిపాడు. ఇక, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే తనకు ఎనలేని గౌరవమని ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. అతనికి తన భావాలపై నియంత్రణ ఉంటుందని, వెంటనే భావోద్వేగానికి గురికాడని అన్నాడు.

ధోనికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కాదని, కానీ వాటిని నియంత్రించడం, అతడికి పుట్టుకతోనే వచ్చిందని ప్యాడీ అప్టన్‌ తన పుస్తకంలో పేర్కొన్నాడు. అయితే, మాజీ కోచ్ ప్యాడీ అప్టన్‌ చేసిన వ్యాఖ్యలపై గంభీర్ స్పందించాడు. ప్యాడీ వ్యాఖ్యలు తననేమి బాధించలేదని.... ప్యాడీ ఓ గొప్ప వ్యక్తి అంటూ కొనియాడాడు.

Story first published: Wednesday, May 1, 2019, 18:57 [IST]
Other articles published on May 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+