Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వర్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులతో గౌతమ్ గంభీర్ (ఫోటోలు)

Gautam Gambhir visits Golden Temple with his family

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గౌతమ్ గంభీర్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాడు. 2011 నుంచి కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించిన గంభీర్‌ ఈ ఏడాది ఢిల్లీ తరుపున ఆడుతున్నాడు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఐపీఎల్ 11వ సీజన్ కోసం ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో కనీస ధర రూ. 2 కోట్లకు గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు గంభీర్ కెప్టెన్‌గా వ్వవహారిస్తాడని ఆ జట్టు ఫ్రాంఛైజీ నిర్వాహకులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Gautam Gambhir visits Golden Temple with his family

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్‌ 7నుంచి మే 27 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో గంభీర్‌ తన కుటుంబసభ్యులతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ఆశీస్సులు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

టోర్నీలో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ తన తొలి మ్యాచ్‌ని మొహాలీ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుతో ఆడనుంది. గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా జట్టు రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 148 మ్యాచ్‌లాడిన గంభీర్ 4,132 పరుగులు చేశాడు.

Story first published: Friday, March 23, 2018, 17:46 [IST]
Other articles published on Mar 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+