టీమిండియా సెలక్టర్లకు గంభీర్ హెచ్చరిక..!!

హైదరాబాద్: టీమిండియాలో కొన్ని సంవత్సరాలుగా చోటు దక్కించుకోకపోయినా తరచూ సెలక్టర్ల పనితీరుపై వారిని ప్రశ్నిస్తూ.. వార్తల్లో నిలుస్తున్నాడు గౌతం గంభీర్. కొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభం కానున్న తరుణంలో బీసీసీఐ టెస్టు సిరీస్ ఆడేందుకు జట్టును ఎంపిక చేసింది. ఆ ఎంపిక పట్ల అసంతృప్తికి గురైన గంభీర్ సెలక్టర్ పనితీరుపై విమర్శలకు దిగాడు. భారత సెలక్టర్లు యువ క్రికెటర్ల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మండి పడ్డాడు.

మురళీ విజయ్‌ని తీసుకోవాల్సింది కాదు
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ఇటీవల జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఫామ్‌లో లేని మురళీ విజయ్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. అతని స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణిస్తోన్న మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవాల్సిందంటూ అభిప్రాయపడ్డాడు. 2018 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మురళీ విజయ్ విఫలమవడంతో.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ నుంచి అతడ్ని తప్పించిన సెలక్టర్లు మయాంక్ అగర్వాల్‌కి అవకాశమిచ్చారు.

మయాంక్ భవిష్యత్‌పై చిన్నచూపా
కానీ.. వెస్టిండీస్‌పై రెండు టెస్టుల్లోనూ అతనిని తుది జట్టులోకి మాత్రం ఆడనివ్వలేదు. దీంతో.. కనీసం ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనైనా అవకాశం వస్తుందేమోనని.. ఎదురుచూసిన మయాంక్‌కి.. కనీసం జట్టులోకి కూడా ఎంపిక చేయకుండా సెలక్టర్లు మొండిచేయి చూపారు. మరోవైపు ఫామ్‌లో లేని మురళీ విజయ్‌కి మళ్లీ అవకాశమిచ్చారు. దీంతో.. సెలక్టర్ల తీరుపై గంభీర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

దేశవాళీ క్రికెట్‌లో అత్యద్భుతంగా రాణించినా..
‘దేశవాళీ క్రికెట్‌లో అత్యద్భుతంగా రాణించినా.. మయాంక్ అగర్వాల్‌ని దురదృష్టం వెంటాడుతోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కి అతను ఎంపికైనా టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటివ్వలేదు. దీంతో.. అతనికి నిరూపించుకునేందుకు అవకాశమే లేకపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి అతడ్ని జట్టు నుంచే తప్పించారు. ఒకవేళ మురళీ విజయ్ మెరుగైన ఆటగాడని సెలక్టర్లు భావిస్తే.. ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత్ అతడ్ని టెస్టు జట్టు నుంచి ఎందుకు తప్పించడానికి కారణాన్ని ప్రశ్నిస్తున్నారు.

జట్టు ఎంపికలో సెలక్టర్లు కచ్చితంగా
ఇప్పుడు మళ్లీ జట్టులోకి ఎందుకు తీసుకున్నారు. మీ నిలకడలేని ఆలోచనల కారణంగా యువ క్రికెటర్‌కి జట్టులో స్థానం పోయింది. జట్టు ఎంపికలో సెలక్టర్లకి కచ్చితంగా ఉండాలి. అంతేకాని.. ఇలా ఆటగాళ్లతో కుర్చీలాట ఆడకూడదు. భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. మొత్తం 4 టెస్టులు ఆ గడ్డపై జరగనున్నాయ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications