గౌతం గంభీర్ కాంట్రవర్సీ.. ధోనీ టార్గెటా? లేక ఓరియో టార్గెటా? పెంపుడు కుక్కకు ఎందుకు ఆ పేరు పెట్టాడు?

మాజీ భారత స్టార్ క్రికెటర్, వరల్డ్ కప్ హీరో గౌతమ్ గంభీర్ మరో కాంట్రవర్సీకి తెరదీశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఓ వీడియోను గౌతీ షేర్ చేశాడు. అయితే ఈ వీడియోలో తన కూతుళ్లతో పాటు.. పెంపుడుకుక్కలు నానా హంగామా చేస్తున్నాయి. అయితే అందులో ఓ కుక్క పేరు ఓరియో అని ఉంది. గౌతీ పిల్లలు ఆ కుక్కను ఓరియో ఓరియో అని పిలుస్తూ ఆట పట్టించారు. ఇక గౌతం గంభీర్ ఈ వీడియోను ఆల్ ఆఫ్ సడెన్‌గా పోస్టు చేయడం అందరినీ ఆసక్తికి గురిచేస్తుంది. ఇటీవలే ధోనీ సస్పెన్స్ అంటూ ఓరియో బిస్కెట్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.
లాంఛ్ సందర్భంగా.. 2011 వరల్డ్ కప్ గెలవడానికి ఓరియో బిస్కెట్ అప్పట్లో లాంఛ్ చేయడం ఓ కారణం కావొచ్చని.. ఈసారి కూడా లాంచ్ చేస్తున్నాం కాబట్టి మళ్లీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ గెలవడానికి ధోనీ ఓరియోకి క్రెడిట్ ఇవ్వడం పట్ల నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం తర్వాత గంభీర్ ఈ వీడియోను అప్ లోడ్ చేస్తూ.. కుక్కకు ఓరియో అని పెట్టిన విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు.

ఇండైరెక్ట్‌గా బ్లేమ్ చేసినట్లు
దీన్ని బట్టి గంభీర్ ఇండైరెక్ట్‌గా ధోనీ ఓరియోకు క్రెడిట్ ఇవ్వడాన్ని బ్లేమ్ చేసినట్లు ఈ ఘటన బట్టి అర్థమవుతుంది. గంభీర్ 2011లో 97పరుగుల కీలక నాక్ ఆడాడు. ధోనీ 91పరుగులతో గేమ్ ముగించాడు. యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇంకా చాలా కారణాలు ఉండగా.. ఓరియోకు క్రెడిట్ ఇవ్వడాన్ని గౌతీ ఇండైరెక్ట్‌గా తప్పుపట్టినట్లు అర్థమవుతుంది. అసలు గంభీర్ ఈ వీడియో ద్వారా ఏం చెప్పదల్చుకున్నాడో మాత్రం అర్థం కాలేదు. కానీ ఇది ఓ మెసేజ్ మాత్రం వెల్లడిస్తుంది.

2గంటలకు సస్పెన్స్ అంటూ బిస్కెట్
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రెండేళ్ల క్రితం అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా నాలుగు సార్లు టైటిల్ అందించిన ధోనీ గతేడాదే సీఎస్‌కేకు గుడ్ బై చెబుతాడని ప్రచారం జరిగింది.
కానీ సొంత మైదానం చెన్నై స్టేడియంలో చెన్నై అభిమానుల ముందు ఆడిన తర్వాతే ఆటకు గుడ్ బై చెబుతానని ప్రకటించాడు. అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా ధోనీ ఓ కీలక ప్రకటన చేశాడు.
మాములుగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే మహీ శనివారం.. ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో సెప్టెంబర్ 25(ఆదివారం) మధ్యాహ్నం 2గంటలకు ఫేస్‌బుక్‌లో లైవ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ కీలక ప్రకటన చేస్తానని చెప్పాడు. దాంతో ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం ఊపందుకుంది.
పూర్తి కమర్షియల్ ప్రమోషన్
అయితే ధోనీ క్రికెట్‌కు సంబంధం లేని విషయాన్ని ధోనీ ప్రకటించాడు. ధోనీ ఏం చెబుతాడోనని సోషల్ మీడియాలో 2గంటలకు కళ్లప్పగించి చూసిన నెటిజన్లకు షాకిచ్చాడు. చాలా మంది అభిమానులు హమ్మయ్యా రిటైర్మెంట్ విషయం కాదని కాస్త కూల్ అయినా.. మరికొందరు మాత్రం అడ్వర్టైజ్ మెంట్ కోసం ఫ్యాన్ ఫాలోయింగ్‌ను వాడుకున్న ధోనీ కమర్షియాలిటీని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ అయిన ఓరియోను మరోసారి 2022లో లాంచ్ చేశాడు. ఇది పూర్తిగా కమర్షియల్ ప్రమోషన్ మాత్రమే.
రిపోర్టర్‌ను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ..
ఇకపోతే ఒక రిపోర్టర్‌ను ధోనీ బిస్కెట్ బ్రాండ్ లాంచింగ్ సందర్భంగా వేదికపైకి ఆహ్వానించాడు. 2011లో ఓరియో బిస్కెట్ బ్రాండ్‌ను ప్రారంభించినప్పుడు భారత్ ప్రపంచకప్ గెలిచిందని చెప్పాడు. ఈ సంవత్సరం మనకు మరో ప్రపంచకప్ (టీ20 ప్రపంచకప్) ఉంది. ఈ ఏడాది కూడా ఓరియో బిస్కెట్ బ్రాండ్‌ను మళ్లీ ప్రారంభించినందున భారత్ మరోసారి టైటిల్ ముద్దాడగలదు' అంటూ ఓ కవరింగ్ ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications