టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం ప్రస్తుతం ముళ్ల బాటలా మారింది. గత కొన్ని నెలలుగా వరుస వైఫల్యాలతో అభిమానులు, విమర్శకుల నుంచి ఆయన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 6 వారాలు గంభీర్ కోచింగ్ కెరీర్‌ను శాసించబోతున్నట్లు తెలుస్తోంది.
గంభీర్ ముందున్న భారీ సవాళ్లు
గౌతమ్ గంభీర్ తనపై ఉన్న విమర్శలను చెరిపివేసి తన కోచింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే వచ్చే ఒకటిన్నర నెలలో రెండు ప్రధాన లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. కివీస్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ కచ్చితంగా గెలవాలి. టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్, ఈ మెగా టోర్నీలో టైటిల్‌ను నిలబెట్టుకోవాలి.
వరుస వైఫల్యాలు.. పెరుగుతున్న విమర్శలు
గత కొన్ని నెలలుగా భారత జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్ట్ క్రికెట్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేయడం గంభీర్ వ్యూహాలపై ప్రశ్నలు లేవనెత్తింది.కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోవడం గంభీర్‌ను మరింత ఇరకాటంలో పడేసింది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా వైట్ బాల్ క్రికెట్‌లో ఈ ఓటములు ఆందోళన కలిగిస్తున్నాయి.
టీమ్ ఎంపికపై సందిగ్ధత
జట్టులో సీనియర్ ఆటగాళ్ల పాత్రపై గందరగోళం నెలకొంది. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల ఫామ్, రవీంద్ర జడేజా పాత్ర, అక్షర్ పటేల్‌ను రిజర్వ్‌లో ఉంచడం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే కేవలం కొన్ని సిరీస్‌ల ఆధారంగా ఆటగాళ్లను అంచనా వేయడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీ20 ఫార్మాట్‌పైనే ఆశలు
గంభీర్‌కు అత్యంత పట్టున్న ఫార్మాట్ టీ20 కావడంతో, అభిమానులు ఇంకా ఆశతో ఉన్నారు. జట్టులోకి కీలక ఆటగాళ్ల పునరాగమనం భారత్‌కు బలాన్నిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులోకి రావడం సానుకూలాంశంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో తిలక్ వర్మ, సంజూ శాంసన్ వంటి అటాకింగ్ ప్లేయర్లు ఫామ్‌లో ఉండటం గంభీర్‌కు కలిసొచ్చే అంశం.

గంభీర్ భవిష్యత్తు తేలేది అక్కడే!
చివరగా టీ20 వరల్డ్ కప్ ఫలితమే గంభీర్ విధిని నిర్ణయిస్తుంది. భారత్ గనుక ఈ టోర్నీలో విజయం సాధిస్తే, విమర్శకుల నోళ్లు మూయించడంతో పాటు ఏడాది చివరలో జరిగే టెస్ట్ సిరీస్‌లపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ విఫలమైతే మాత్రం, బీసీసీఐ కొత్త కోచ్ గురించి ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. గంభీర్ వ్యూహాలు, ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసే ప్రయోగాలు రాబోయే మ్యాచ్‌ల్లో ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.