For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

37వ పడిలోకి గంభీర్: సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

Gautam Gambhir turns 37: Cricketers, fans greet veteran India batsman on his birthday

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆదివారం (అక్టోబర్ 14)న 37వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గంభీర్‌కు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు సహాచర క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

2003లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి గౌతమ్ గంభీర్ భారత్ తరుపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లాడాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో గంభీర్ ఢిల్లీ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

గంభీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం:

* టెస్టుల్లో వరుసగా 5 సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మన్. న్యూజిలాండ్‌పై 2, శ్రీలంకపై 2, బంగ్లాదేశ్‌పై ఒక సెంచరీని గంభీర్ సాధించాడు.

* క్రీజులో ఎక్కువ సేపు ఉన్న రెండో బ్యాట్స్ మన్. 2009లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 137 పరుగులు చేసిన గంభీర్ మొత్తం 643 నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు.

* 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత విజయంలో గౌతమ్ గంభీర్ కీలకపాత్ర పోషించాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగులు చేసిన గంభీర్, ముంబైలోని వాంఖడె స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 97 పరుగులతో తృటిలో సెంచరీని మిస్సయ్యాడు.

* కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండుసార్లు ట్రోఫీని అందుకున్నాడు. 2009లో ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు. 2009లో సూపర్ ఫామ్ లో ఉన్న గౌతమ్ గంభీర్ ఐసీసీ ప్రకటించే టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాడు.

* 2008లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక అర్జున అవార్డుని కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తన 37వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో గంభీర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Story first published: Sunday, October 14, 2018, 14:36 [IST]
Other articles published on Oct 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+