Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

35వ పడిలోకి గంభీర్: సచిన్ విషెస్, ఆసక్తికర విషయాలు

న్యూఢిల్లీ: వెటర్నన్ టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ శుక్రవారం (అక్టోబర్ 14)న 35వ వసంతంలోకి అడుగుపెట్టారు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన చివరి టెస్టులో గంభీర్ ఆడిన సంగతి తెలిసిందే. ఇండోర్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Gautam Gambhir turns 35: Sachin Tendulkar, Anil Kumble send wishes onTwitter

గంభీర్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు:

* 2003లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
* వరుసగా ఐదు టెస్టు సెంచరీలు(న్యూజిలాండ్‌పై 2, శ్రీలంకపై 2, బంగ్లాదేశ్‌పై 1) సాధించిన భారతీయ బ్యాట్స్‌మెన్.
* క్రీజులో ఎక్కువ సేపు ఉన్న ఆటగాడు. 2009లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగులు చేసి 643 సెకన్ల పాటు క్రీజులో ఉన్నాడు.
* ధోని కెప్టెన్సీలో భారత్ వరల్డ్ కప్‌లు సాధించిన 2007, 2011లలో కీలక పాత్ర పోషించాడు.
* 2007లో పాకిస్థాన్‌తో జరిగిన వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో 75 పరుగులు చేయగా, 2011లో శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో 97 పరుగుల చేశాడు.
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గెలిచిన ముగ్గురు కెప్టెన్లలో రెండుసార్లు ట్రోఫీని గెలిచాడు. మిగతా ఇద్దరిలో రోహిత్ శర్మ ఒకరు కాగా, మరొకరు ధోని.
* 2009వ సంవత్సరంలో ఐసీసీ టెస్టు ప్లేయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.

గంభీర్ 35వ పుట్టినరోజుని పురస్కరించుకుని మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే‌తో పాటు పలువురు మాజీలు గంభీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+