Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : కోహ్లీ బ్యాటింగ్‌ తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన గంభీర్!

Gautam Gambhir talks about Virat Kohli batting in Delhi test

ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ పట్టుదల ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోయినప్పుడు క్రీజులో ఉన్న అతను.. జట్టును మళ్లీ గాడిలో పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. చాలా పట్టుదల ప్రదర్శించిన అతను.. ఓర్పుగా ఒక్కో పరుగూ చేస్తూ కీలకమైన 44 పరుగులు చేశాడు.

ఆ తర్వాత ఎల్బీడబ్ల్యూగా అవుటైనా కూడా ఈ అవుటైన విధానం వివాదాస్పదం అయింది. బ్యాట్, ప్యాడ్‌ను బంతి ఒకేసారి తాకినా కూడా అతన్ని అంపైర్ అవుట్ ఇచ్చాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్సులో కూడా 20 పరుగులతో భారత విజయంలో తనవంతు పాత్ర పోషించాడు కోహ్లీ.

కోహ్లీ సూపర్ బ్యాటింగ్..

కోహ్లీ సూపర్ బ్యాటింగ్..

ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ స్టంప్ అవుట్ అయ్యాడు. తన టెస్టు కెరీర్‌లో కోహ్లీ ఇలా అవుట్ అవడం ఇదే తొలిసారి. ఈ ఇన్నింగ్స్‌లపై టీమిండియా మాజీ ఓపెనర్, లెజెండరీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. 'సుదీర్ఘకాలం ఆడినప్పుడు అన్ని రకాలుగా అవుటవడం సహజమే. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతని కంట్రోల్. ఈ టెస్టులో విరాట్ కోహ్లీ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అఫ్‌కోర్స్ అతను చేసింది 60-65 పరుగులే కానీ.. అతని బ్యాటింగ్ మాత్రం అద్భుతం' అని మెచ్చుకున్నాడు.

భారీ పరుగులు ఖాయం..

భారీ పరుగులు ఖాయం..

ఆస్ట్రేలియాతో జరిగే మిగతా రెండు టెస్టుల్లో కోహ్లీ ఇదే పట్టుదల ప్రదర్శించాలని, మరిన్ని కీలకమైన ఇన్నింగ్సులు ఆడాలని గంభీర్ ఆశించాడు. 'ఇంతకుముందు కూడా నేను ఇదే మాట చెప్పా. ఆటగాడికి కాన్ఫిడెన్స్ ఇచ్చేది పరుగులే. కానీ ఇంతకాలం ఆడినప్పుడు ఎలా ఆడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.

కాబట్టి కోహ్లీ కనుక ఇదే రిథమ్‌లో ఆడితే.. మిగతా మ్యాచుల్లో కచ్చితంగా భారీగా పరుగులు చేస్తాడు' అని గంభీర్ అంచనా వేశాడు. రెండో టెస్టులో ఫర్వాలేదనిపించిన కోహ్లీ.. అత్యంత వేగంగా 25 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన సంగతి తెలిసిందే.

ఇది చూసి నేర్చుకోవాలి..

ఇది చూసి నేర్చుకోవాలి..

కోహ్లీ బ్యాటింగ్‌ను తను కూడా మెచ్చుకున్న మాజీ లెజెండ్ మహమ్మద్ కైఫ్.. అతని ఇన్నింగ్స్ అద్భుతంగా సాగిందన్నాడు. 'ఎవరైనా చిన్న కుర్రాడు టెస్టు క్రికెట్‌లో టెక్నిక్ నేర్చుకోవాలి అనుకుంటే.. ఇలానే ఆడాలి. ఇక్కడ నువ్వు పరుగులు చేస్తావా? చెయ్యవా? అనేది పాయింట్ కాదు.

అందరూ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరుగుతున్న టర్నింగ్ ట్రాక్‌పై కోహ్లీ ఆటతీరు, ఒక ప్రణాళిక ప్రకారం బ్యాటింగ్ చేయడం సూపర్' అని మెచ్చుకున్నాడు. ముఖ్యంగా కోహ్లీ తన ఫుట్‌వర్క్‌లో కచ్చితత్వం చూపించాడని కొనియాడాడు.

Story first published: Monday, February 20, 2023, 14:26 [IST]
Other articles published on Feb 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+