నలుపు రంగు చేతి బ్యాండ్లతో:
‘నలుపు రంగు చేతి బ్యాండ్లు బెంగళూరులోనూ దొరుకుతాయి. రూ.225 పెడితే ఓ రోల్ వస్తుంది. సర్, ముందుగా నవదీప్ భారతీయుడని గుర్తుంచుకోండి. అతడు ఏ రాష్ట్రం నుంచి వచ్చాడనేది తర్వాతి సంగతి' అంటూ గంభీర్ మాజీలకు చురకలు అంటించాడు. షమీ ఫిట్‌నెస్ నిరూపించుకో లేకపోవడంతో అప్ఘాన్‌తో టెస్టుకి నవదీప్ సైనీని సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

సైనీ తొలిసారి ఢిల్లీ రంజీ జట్టుకు
2013లో గంభీర్ ప్రోద్బలంతో నవదీప్ సైనీ తొలిసారి ఢిల్లీ రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఢిల్లీ జట్టులో సైనీని చేర్చుకోవడాన్ని ప్రశ్నిస్తూ బేడీ డీడీసీఏ ప్రెసిడెంట్ అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కర్నాల్‌కు చెందిన నవదీప్‌ను ఢిల్లీ జట్టులోకి ఎలా తీసుకుంటారు? గత ఏడాది కాలంలో అతడు ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడలేదు. బయటి వ్యక్తిని జట్టులోకి తీసుకోవడం సరైంది కాదు.

షైనీ ఎంపిక పట్ల బేడీ అసంతృప్తి
ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం కోసం చాలా మంది కుర్రాళ్లు ఎదురు చూస్తున్నారంటూ.. షైనీ ఎంపిక పట్ల బేడీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గంభీర్ చొరవతో సైనీని ఢిల్లీకి ఎంపిక చేయడం పట్ల డీడీసీఏ అధికారులు తీవ్రంగా అసహనానికి లోనయ్యారు.

సైనీ బౌలింగ్ యాక్షన్ విమర్శిస్తూ..
సైనీ బౌలింగ్ యాక్షన్ విమర్శిస్తూ.. బయటి వ్యక్తిని ఢిల్లీ జట్టుకు ఎంపిక చేశారంటూ కరపత్రాలు పంచి పెట్టారు. ఈ రచ్చ మొత్తం ఇప్పటికీ మర్చిపోని గంభీర్ ట్వీట్ ద్వారా వారికి చురకలు అంటించాడు. గంభీర్ సైనీకి తన వంతుగా సాయం చేశాడు. కాబట్టే భారత జట్టుకు ఎంపిక కాగానే.. ఈ పేసర్ గౌతీ భాయ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానంటూ ఉద్వేగానికి లోనైయ్యాడు.


Click it and Unblock the Notifications












