For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హారికకు పద్మశ్రీ: క్రీడల్లో గంభీర్‌, ఛెత్రి సహా 9 మందికి 'పద్మ' అవార్డులు

Gautam Gambhir, Sunil Chhetri, Bajrang Punia Among Sportspersons Named As Recipients Of Padma Shri

హైదరాబాద్: దేశ ప్రతిష్టను నలుదిశలా ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 'పద్మ' పురస్కారాలతో గౌరవించింది. వివిధ రంగాల నుంచి మొత్తం 112 మందికి ఈ అవార్డులు రాగా క్రీడా విభాగం నుంచి మొత్తం తొమ్మిది మంది ఈ పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.

తెలుగు క్రీడాకారిణి, గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. 20 ఏళ్ల వయసుకే గ్రాండ్‌మాస్టర్‌ అయిన హారిక.. 2007-08 సంవత్సరానికి అర్జున అవార్డు గెలిచింది. ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడు కాంస్యాలు గెలవడంతో పాటు అంతర్జాతీయ టోర్నీల్లో మరెన్నో పతకాలు సాధించింది.

1991 జనవరి 12న గుంటూరులో జన్మించిన హారిక 2000లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌-10 బాలికల విభాగంలో రజత పతకం గెలిచి వెలుగులోకి వచ్చింది. దీంతో హారిక తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ తమ అమ్మాయికి మరింత మెరుగైన శిక్షణ ఇప్పించారు. కోచ్‌ ఎన్‌వీఎస్‌ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటూ హారిక మరింత రాటుదేలింది.

హారిక ద్రోణవల్లి

హారిక ద్రోణవల్లి

2008 ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన హారిక... 2009లో ఆసియా మహిళా చాంపియన్‌గా... 2010లో కామన్వెల్త్‌ చాంపియన్‌గా అవతరించింది. 2011లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా పొందిన ఆమె వరుసగా మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలను కూడా దక్కించుకుంది.

బచేంద్రీ పాల్‌

బచేంద్రీ పాల్‌

28 ఏళ్ల హారిక గత ఏడాదే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హారికకు ‘పద్మశ్రీ' పురస్కారం రావడంపట్ల ఆమె తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్‌' లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 64 ఏళ్ల బచేంద్రీ పాల్‌ 1984లో మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించారు.

సునీల్ ఛెత్రి

సునీల్ ఛెత్రి

సికింద్రాబాద్‌లో పుట్టి ఇక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించిన భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. గత ఏడాది వందో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి రికార్డులకెక్కిన ఛెత్రి.. 67 గోల్స్‌ కూడా సాధించాడు. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాను పద్మ శ్రీ వరించింది.

గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

టీమిండియా మాజీ ఓపెనర్‌, 37 ఏళ్ల గౌతమ్‌ గంభీర్‌కు సైతం పద్మశ్రీ దక్కింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక, ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌' టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆచంట శరత్‌ కమల్‌... భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌లకు సైతం పద్మశ్రీ అవార్డులు లభించాయి.

శరత్‌ కమల్‌

శరత్‌ కమల్‌

2016 కబడ్డీ ప్రపంచకప్‌ భారత్‌కు దక్కడంలో అజయ్‌ ఠాకూర్‌ ముఖ్యపాత్ర పోషించాడు. తెలుగు వాడే అయినా, తమిళనాడులో స్థిరపడి ఆ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తూ.. ప్రపంచ స్థాయిలో మెరిసిన టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ శరత్‌ కమల్‌తో పాటు సీనియర్‌ ఆర్చరీ క్రీడాకారిణి బాంబేలా దేవి, భారత కబడ్డీ కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌ పద్మశ్రీ దక్కించుకున్నారు.

క్రీడా విభాగంలో పద్మ పురస్కాలకు ఎంపికైంది వీరే

క్రీడా విభాగంలో పద్మ పురస్కాలకు ఎంపికైంది వీరే

పద్మ భూషణ్‌: బచేంద్రీ పాల్‌ (ఉత్తరాఖండ్‌-పర్వతారోహణ)

పద్మశ్రీ: ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్‌-చెస్‌); బజరంగ్‌ పూనియా (హరియాణా-రెజ్లింగ్‌); సునీల్‌ చెత్రి (తెలంగాణ-ఫుట్‌బాల్‌); గంభీర్‌ (ఢిల్లీ-క్రికెట్‌); ఆచంట శరత్‌ కమల్‌ (తమిళనాడు-టేబుల్‌ టెన్నిస్‌); బొంబేలా దేవి (మణిపూర్‌-ఆర్చరీ); ప్రశాంతి సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌-బాస్కెట్‌బాల్‌); అజయ్‌ ఠాకూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌-కబడ్డీ)

Story first published: Saturday, January 26, 2019, 8:33 [IST]
Other articles published on Jan 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+