'గంభీర్.. ఇంకొంచెం ఎక్కువగా నవ్వితే బాగుంటుందని కోరుకుంటున్నా'

న్యూ ఢిల్లీ: భారత్ బ్యాట్స్‌మెన్‌లో ప్రత్యేక శైలితో పాటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ గౌతం గంభీర్. మంగళవారం అన్నీ అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలుకుతూ తన రిటైర్మెంట్‌ను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రకటించాడు. అందులో తన భావోద్వేగపూరిత వీడియోను అనుసంధానించి పోస్టు చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శనల్లో ఒకటైన 2011 ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీలో న్యూజిలాండ్‌కు ప్రత్యర్థిగా ఆడిన ఇన్నింగ్స్ చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.
ఈ క్రమంలో మరో టీమిండియా మాజీ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ద్వారా గంభీర్ తీసుకున్న సంచలన నిర్ణయానికి శుభాకాంక్షలు స్పందించాడు.
వరల్డ్ కప్ ఫైనల్స్‌లో చక్కగా చూపించగలిగావు
'గంభీర్ నువ్వు అత్యద్భుతమైన కెరీర్‌ను గడిపావు. నీలో ప్రత్యేకమైన నైపుణ్యముంది. దానిని వరల్డ్ కప్ ఫైనల్స్‌లో చక్కగా చూపించగలిగావు. నాపియర్‌లో నీతో కలిసి బ్యాటింగ్ చేయడం మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఇక నీ సెకండ్ ఇన్నింగ్స్‌ను కుటుంబం స్నేహితులతో గడిపేయ్.' అని ట్వీట్ చేశాడు.
క్రికెట్ కోసం చేసిన సేవలు అమోఘనీయం.
242 మ్యాచ్‌లు, 10,324 పరుగులు నీ కఠిన శ్రమ, నీలోని కచ్చితత్వం లేకుండా ఇవేమీ సాధ్యం కావు. క్రికెట్ కోసం నువ్వు చేసిన సేవలు అమోఘనీయం. నీతో కలిసి మైదానాన్ని పంచుకోవడం గౌరవంగా అనిపిస్తోంది. నీకు మున్ముందు ఇంకా మంచి జరగాలని ఆశిస్తున్నాను.
భారత క్రికెట్‌లో ఆడటం గర్వంగా
నీ భవిష్యత్ కోసం ఆల్ ద బెస్ట్. నీ కెరీర్‌లో అత్యద్భుతంగా రాణించావు. భారత క్రికెట్‌లో నువ్వు ఆడటం గర్వంగా అనిపిస్తోంది.
నీతో పంచుకోవడం ఇంకా ఆనందంగా
నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల నేను చాలా సంతోషపడుతున్నాను. దీనిని నీతో పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. నీ అత్యాద్భుతమైన ప్రయాణానికి కంగ్రాచ్యులేషన్స్
నవ్వితే బాగుంటుందని కోరుకుంటున్నా
ఆంధ్రతో ఢిల్లీ ఆడబోయే తర్వాతి రంజీ మ్యాచే నా కెరీర్‌లో ఆఖరిది. నా కెరీర్ మొదలైన ఫిరోజ్ షా కోట్లాలోనే నా ప్రస్ధానం ముగియనుంది. రిటైర్మెంట్ ఆలోచన కొంతకాలంగా నన్ను వెంటాడుతోంది. చికాకు పరిచే అదనపు సరంజామాగా విమానాల్లోనూ నాతో ప్రయాణించింది. నాతోపాటు సాధనకూ వచ్చింది. నన్ను వెక్కిరిస్తూనే ఉంది. ఎవరో నా కథ రాస్తున్నారనేది నా భావన. ఐతే ఇప్పుడు సిరా అయిపోయింది. కానీ ఈ క్రమంలో కొన్ని మనోహరమైన అధ్యాయాలు రాశాడు. న్యూజిలాండ్‌లో సిరీస్ విజయం, ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్ విజయం నా కథలో మధుర అధ్యాయాలే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications