నేను కొంచెం అతి చేశా, మాకూ భావోద్వేగాలుంటాయ్: గంభీర్
కోల్‌కతా: డగౌట్‌లో కుర్చీ తన్నడంపై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ బుధవారం నాడు స్పందించాడు. మేం ప్రముఖులం అయినంత మాత్రాన మాకు భావోద్వేగాలు ఉండవా? మేం భావోద్వేగాలను దాచిపెట్టుకోవాలా? అని ప్రశ్నించాడు.
అయితే, తన ప్రవర్తనకు గౌతమ్ గంభీర్ క్షమాపణ చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సమయంలో తాను కొంచెం అతిగా ప్రవర్తించానని అంగీకరించాడు. క్షమాపణలు చెప్పాడు. అదే సమయంలో తమకూ భావోద్వేగాలు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నాడు.
తమ భావోద్వేగాలను ప్రదర్శించే హక్కు ప్రముఖులకు లేదా అన్నాడు. సోమవారం బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా విజయానికి చేరువైన సందర్భంలో డగౌట్‌లో ఉన్న గంభీర్.. కోపంతో కుర్చీని తన్నిన విషయం తెలిసిందే. జట్టు గెలుస్తుంటే గంభీర్ ఎందుకలా ప్రవర్తించాడో అర్థంకాక కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు.

దీనిపై గంభీర్ మాట్లాడుతూ.. నేను చేసింది తప్పేనని, అందుకు క్షమాపణ కోరుతున్నానని, అయితే మ్యాచ్‌లో యూసుఫ్, రసెల్ ఆటను అభినందించాల్సిందిపోయి అందరూ కుర్చీ వివాదంపైనే పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనం మనుషులం. భావోద్వేగాలనేవి సహజమన్నాడు.
గతేడాది ఓ రంజీ మ్యాచ్ సమయంలోనూ బంగాల్ ఆటగాడు మనోజ్ తివారీతో గొడవకు దిగి గంభీర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
కాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి శిక్షకు గురయ్యాడు. బెంగళూరుతో సోమవారం మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా విజయం ఖరారయ్యే సమయంలో అతను ఆవేశపడ్డాడు. చివర్లో సూర్య కుమార్ బౌండరీ బాదగానే తమ డగౌట్లోనే ఉన్న కుర్చీని గట్టిగా తన్నాడు. దీంతో అతడికి మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications