రంజీ ట్రోఫీ: కెరీర్ ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ బాదిన గౌతమ్ గంభీర్

హైదరాబాద్: టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ తన ఆఖరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. మంగళవారం అనూహ్యంగా క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు 11 నిమిషాల నిడివి కలిగిన వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌చేస్తూ 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
ఆంధ్రతో తాజాగా జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో 185 బంతులాడి 10 ఫోర్లు సాయంతో 112 పరుగులు చేశాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 92తో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన గంభీర్.. సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

కెరీర్‌లో గంభీర్‌కి ఇది 42వ సెంచరీ
ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో గంభీర్‌కి ఇది 42వ సెంచరీ. గంభీర్ సెంచరీతో ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లు ముగిసే సమయానికి 221/2తో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకి ఆలౌటైంది. ఆంధ్ర తరుపున రికీ భుయ్ (187) సెంచరీని నమోదు చేశాడు.

ఆటలో మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో
ఆటలో మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గౌతమ్ గంభీర్ 1999-2000లో జరిగిన రంజీ సీజన్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే టీమిండియాకి ఎంపికై దశాబ్దకాలం పాటు ఓపెనర్‌గా అద్వితీయ రికార్డుల్ని నమోదు చేశాడు.

రెండేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న గంభీర్
అయితే.. రెండేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న ఈ వెటరన్ క్రికెటర్.. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలు ఆడుతూ అభిమానుల్ని అలరించాడు. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన గౌతమ్ గంభీర్.. కెరీర్‌లో మొత్తం 58 టెస్టులాడి 4,154 పరుగులు చేశాడు.

రెండు వరల్డ్ కప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడు
ఇందులో 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉండగా.. 147 వన్డేల్లో 5,238 పరుగులు చేశాడు. వన్డేల్లోనూ నిలకడగా రాణించిన ఈ ఓపెనర్ 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక 37 టీ20ల్లోనూ 932 పరుగులు చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలోనూ గౌతమ్ గంభీర్ సభ్యుడిగా ఉండటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications