Gautam Gambhir: కోహ్లీని ఓపెనర్‌గా పంపించాలనే అర్థంపర్థం లేని మాటలు మాట్లాడొద్దు.. నంబర్ 3లో కూడా వద్దు

ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుపు సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో రికీ పాంటింగ్ సెంచరీల (71) సంఖ్యను కోహ్లీ సమం చేశాడు. తన కెరీర్‌లో తొలిసారిగా టీ20లలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ గైర్హాజరీ కావడంతో కోహ్లీ ఓపెనింగ్‌గా దిగి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీని ఓపెనర్‌గా బరిలోకి దించాలని పలువురు మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం కోహ్లీని ఓపెనర్‌గా కాకుండా నం.3 బ్యాటర్‌గానే పంపిస్తే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

శుభారంభం దక్కితే కోహ్లీని నంబర్ 3లో కూడా ఆడించొద్దు
ముక్కుసూటిగా తన అభిప్రాయాలను చెప్పే గౌతం గంభీర్ ఈ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలనే చర్చలను కొట్టిపారేశాడు. భారత జట్టు కోహ్లీని నంబర్ 3 స్థానంలోనే పంపించాలని అదే అతనికి సరైన స్థానం అని గంభీర్ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని గనుక ఇస్తే.. నంబర్ 3లో కోహ్లీకి బదులు సూర్యకుమార్ యాదవ్‌ను పంపించాలని కూడా పేర్కొన్నాడు.

నంబర్ 3లో సూర్య రావాలి
'కోహ్లీ బ్యాకప్ ఓపెనర్ మాత్రమే. కోహ్లీ ఓపెనింగ్ చేయాలనే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటే కోహ్లీని ఓపెనర్‌గా ఆడించలేం. నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నా ఉద్దేశంలో కోహ్లీ ఎప్పుడూ నంబర్ 3గా ఫ్లెక్సిబుల్. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ 10వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేస్తే.. కోహ్లీని నంబర్ 3లో కూడా ఆడించొద్దు.
ఆ టైంలో సూర్యకుమార్ యాదవ్ నంబర్ 3లో రావాలి. ఒకవేళ తొందరగానే వికెట్ పడితే నంబర్ 3లో విరాట్ రావాలి.' అని స్టార్ స్పోర్ట్స్‌లోని 'గేమ్‌ప్లాన్' ఎపిసోడ్‌లో గంభీర్ పేర్కొన్నాడు. కోహ్లీ స్థానం గురించి గంభీర్ వ్యాఖ్యలను ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కూడా సమర్థించాడు. కీలకమైన టీ20 ప్రపంచకప్ ముందు జట్టులో ప్లేయర్ల స్థానాలపై సందేహాలు నెలకొల్పితే.. అది ఆటగాళ్లపై అనవసర ఒత్తిడిని తెస్తుందని హేడెన్ పేర్కొన్నాడు.

కోహ్లీ గురించి ఈ చర్చే వద్దు
'విరాట్ బ్యాటింగ్ గురించి ఇదంత గొప్ప చర్చేమీ కాదు. గంభీర్ చెప్పిన విషయం ఏదైతే ఉందో అలాంటి అభిప్రాయాన్నే నేను కూడా కలిగి ఉన్నాను. అతను బ్యాటింగ్లో ఓపెనింగ్ చేయడానికి సరైన మార్గం లేదు. అతను నంబర్ 3లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం గురించి ఇకమీదట చర్చ తేవొద్దని అనుకుంటున్నా. కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతను 3వ నంబర్ వద్ద సరైన రకంగా బ్యాటింగ్ చేయగలడు.' అని హేడెన్ అన్నారు.

ఆస్ట్రేలియాపై చెలరేగడమే
సెప్టెంబర్ 20న మొహాలీలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో డిఫెండింగ్ టీ20ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఇక విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై చెలరేగుతాడనే సంగతి తెలిసిందే. ఆసీస్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గాను కోహ్లీ కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాపై అతను 7టీ20 హాఫ్ సెంచరీలు సాధించాడు.
కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియాపై టీ20లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన వాళ్లలో యువరాజ్ సింగ్ 3, రోహిత్ శర్మ 3, రాహుల్ 2, ధావన్ 2, గంభీర్ 2 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇకపోతే చివరిసారిగా 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో కోహ్లీ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 85పరుగులు చేశాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై చివరి ఐదు టీ20ల్లో 85, 40, 9, 72నాటౌట్, 24 స్కోర్లు చేశాడు. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్లో విరాట్ 199పరుగులు (90*, 59*, మరియు 50)తో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications