
చిన్న పిల్లల మాటలా అనిపిస్తోంది
ఆస్ట్రేలియా పర్యటనలోని టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టును ఆడి గెలుచుకుంది టీమిండియా. తొలి టెస్టులోనే గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుపై ప్రశంసలు కురిపించాడు రవిశాస్త్రి. గత 15ఏళ్లుగా ఇలాంటి జట్టు లేదని, విదేశాల్లో పర్యటించిన భారత జట్లలో ఇదే అత్యుత్తమమైన జట్టు అంటూ కొనియాడాడు. వీటిపై స్పందించిన గంభీర్ 'ఇది పరిపక్వత లేని చిన్న పిల్లల మాటలా అనిపిస్తోంది. ఈ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. నేను కూడా అంతే. అతని పరిణతి చెందని ఆలోచన తీరుతో చెప్పిన మాటలు ఎందుకు పనికి రావు.

ఆటతీరును మెరుగుపరచుకునేందుకు
కేవలం నాలిగింటిలో ఒక్క టెస్టు మ్యాచ్ గెలిస్తే సరిపోదు. ఇంకా ఆడాల్సి ఉంది. దీనికి భిన్నంగా ఈ విజయానికి సంతోషిస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది. మా ఆటతీరును మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తాం. అంటూ చెబితే హుందాగా ఉండేది. అసలు రవిశాస్త్రి కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాలంటే ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ మినహాయించి ఏమీ లేవనే అనిపిస్తుంటుంది. ఈ విదేశీ పర్యటనలో విజయంలోనూ అతని పాత్ర ఉందంటే నమ్మను. తనంతట తాను గెలవకుండా జట్టు గెలిస్తే దానిని తనకు ఆపాదించుకోవడం సబబు కాని పని. అయినా ఇటువంటి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోరనే భావిస్తున్నా.

రవిశాస్త్రి ఎప్పుడు.. ఏమన్నాడంటే
అసలు రవిశాస్త్రి ఏమన్నాడంటే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లిన రవిశాస్త్రి 'విదేశీ పర్యటన చేసిన అత్యుత్తమ జట్టు ఇదే. గత మూడేళ్లుగా సాధించిన విజయాలు చూస్తే.. 15-20ఏళ్లుగా ఇటువంటి అత్యుత్తమ భారత జట్టు మరెక్కడా కనిపించదు. ప్రస్తుత జట్టులో గొప్ప క్రికెటర్లు ఉన్నారు.' అంటూ చెప్పుకొచ్చాడు.

గవాస్కర్, గంగూలీతో పాటు పలువురు
నిజానికి రవిశాస్త్రి అప్పుడు చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీతో పాటు పలువురు ప్రముఖులు గట్టిగానే బదులిచ్చారు. ఇలా వివాదాస్పదంగా పత్రికా సమావేశంలో మాట్లాడటం రవిశాస్త్రికి కొత్తేం కాదు.


Click it and Unblock the Notifications












