ఐపీఎల్‌ ఆడే రోజుల్లో కెప్టెన్‌గా ఆ ఒక్క ఆటగాడికి చాలా భయపడేవాడని: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఆడే రోజుల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథిగా ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా భయపడేవాడినని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. అతన్ని ఔట్ చేయడానికి ఐదు,ఆరు ప్రణాళికలతో బరిలోకి దిగేవాడినని చెప్పుకొచ్చాడు. అలాంటి క్వాలిటీస్ ఇప్పుడు కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌లో కనిపిస్తున్నాయని ఈ క్రికెటర్ కమ్ పొలిటీషియన్ అభిప్రాయపడ్డాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్.. రాహుల్ సూపర్ సెంచరీతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గురించి ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో‌లో మాట్లాడిన గంభీర్.. రాహుల్, రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు.

ఏబీడీ, విరాట్ కన్నా..

ఏబీడీ, విరాట్ కన్నా..

ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ కన్నా రోహిత్, రాహుల్ వంటి ఆటగాళ్లను అడ్డుకోవడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. రోహిత్, రాహుల్‌ను ఔట్ చేయాలంటే ప్రత్యర్థి జట్లు నాలుగైదు వ్యూహాలు రచించాలన్నాడు. అదే విరాట్, ఏబీడికి రెండు ప్రణాళికలు సరిపోతాయని చెప్పుకొచ్చాడు.

‘కేఎల్ రాహుల్ చాలా అరుదైన బ్యాట్స్‌మన్. బంతిని వికెట్‌కు రెండు వైపులా కొట్టగలే బ్యాట్స్‌మెన్‌లలో రాహుల్ ఒకరైతే.. మరొకరు రోహిత్. కేఎల్ రాహుల్‌కు బౌలింగ్‌కు చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అతను కుదురుకుంటే ఆపలేం. బాల్‌ను పిచ్ చేయలేం.. విడ్త్ వేయలేం. స్టంప్స్‌ను టార్గెట్ చేయలేం. అలాగే రోహిత్‌ మంచి మూడ్‌లో ఉంటే కూడా వైడ్ రేంజ్ బంతులు వేయలేం.

ఐదు, ఆరు ప్రణాళికలు..

ఐదు, ఆరు ప్రణాళికలు..

నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇతరుల కన్నా రోహిత్ శర్మకే ఎక్కువగా భయపడేవాడిని. ఎందుకంటే అతన్ని ఔట్ చేయాలంటే మనదగ్గర ఐదారు ప్లాన్స్ ఉండాలి. విరాట్, ఏబీడీని కూడా సులువుగా ఔట్ చేయవచ్చు. కానీ రోహిత్‌ను అలా కాదు. విరాట్‌, ఏబీడీకి రెండు వ్యూహాలు అయితే సరిపోతుంది. ఏబీడీ 360 డిగ్రీలు ఆడవచ్చు. కానీ అతను షార్ట్ బాల్స్ ఆడలేడు. అలాగే కేఎల్ రాహుల్‌కు బౌలింగ్ చేయడం పీడకల లాంటిదే'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యమే..

కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యమే..

ఇక పంజాబ్‌తో ఆర్‌సీబీ ఓటమికి కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యమే కారణమని గంభీర్ విమర్శించాడు. శివమ్ దూబేతో బౌలింగ్ చేయించడం విరాట్ చేసిన అతిపెద్ద తప్పన్నాడు. అతను తొలి మూడు ఓవర్లు బాగా వేసాడని, చివరి ఓవర్ ఇచ్చాడని, అప్పటికే క్రీజులో కుదురుకున్న రాహుల్ ఆడుకున్నాడని తెలిపాడు. సైనీతో ఆ ఓవర్ వేసుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. సరైన బౌలింగ్ వ్యూహం లేకపోవడం వల్ల ఆర్‌సీబీ ఓటమిపాలైందని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ రికార్డు సెంచరీ..

రాహుల్ రికార్డు సెంచరీ..

ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లోకేశ్‌ రాహుల్‌ (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 నాటౌట్‌ ) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌.

విరాట్‌ను విమర్శించలేదు.. అనుష్క శర్మపై అసహ్యకర వ్యాఖ్యలు చేయలేదు: సునీల్ గవాస్కర్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 25, 2020, 20:03 [IST]
Other articles published on Sep 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X