Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ నాకు పీడకలలు చూపించాడన్న గంభీర్.. అయినా సరే విష్ చేశాడు

Gautam Gambhir Says Rohit Sharma Showed Him Nightmares But Still Wished On Birthday
Photo Credit: twitter

టీమిండియా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత తరంలో గొప్ప క్రికెటర్లలో ఒకడిగా పేరొందాడు. తన బ్యాటింగ్‌తో టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా 5 ట్రోఫీలు అందించాడు. అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై నిలవడానికి రోహిత్ ఓ కారణం. నేడు రోహిత్ బర్త్‌డే.. 35వడిలోకి రోహిత్ అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ ముందున్న అతి పెద్ద లక్ష్యం ఐసీసీ ట్రోఫీని గెలవడమే.

కెప్టెన్సీ మార్క్ చూపించడానికి గొప్ప అవకాశం

రోహిత్ తన కెప్టెన్సీ మార్క్‌ను చరిత్రలో నిలపడానికి ఈ ఏడాది చివర్లో జరగబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ ఒక గొప్ప అవకాశమని చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ కెరీర్లో రోహిత్ గణాంకాలను చూస్తే.. టీ20 ఫార్మాట్లో 32.48సగటుతో 3,313 పరుగులు చేసిన రోహిత్ అందులో 26హాఫ్ సెంచరీలతో పాటు.. నాలుగు సెంచరీలు కూడా చేయడం గమనార్హం. అతని స్ట్రైక్ రేటు 139.55గా ఉంది.

ఆ ఫీట్ సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్

ఇక వన్డేల విషయానికొస్తే 230 వన్డేలు ఆడిన రోహిత్.. 48.6సగటుతో 9,283పరుగులు చేశాడు, 44 హాఫ్ సెంచరీలు, 29 సెంచరీలు, 3డబుల్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్. టెస్ట్ ఫార్మాట్లో 45మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 46.13సగటుతో 3,137పరుగులు చేశాడు. టెస్ట్ కెరీర్లో 14హాఫ్ సెంచరీలు, 8సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది.

రోహిత్‌కు శుభాకాంక్షల వెల్లువ

రోహిత్ బర్త్‌డే సందర్భంగా ట్విట్టరు, ఇతర సామాజిక మాధ్యమాల్లో అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ ప్రముఖులు, సహచర క్రికెటర్లు, అభిమానులు స్పెషల్ డీపీలతో రోహిత్ బర్త్ డేను స్పెషల్ డేగా ట్రీట్ చేస్తున్నారు. రోహిత్ బర్త్ డే సందర్భంగా క్రికెటర్లు ఆసక్తికర ట్వీట్లు చేశారు. భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ట్వీట్ చేస్తూ.. కెప్టెన్‌గా తనకు పీడకలలు చూపించిన రోహిత్ శర్మకు బర్త్ డే గ్రీటింగ్స్.. హమ్మయ్యా ప్రస్తుతం నేను కెప్టెన్‌గా లేను అని పేర్కొన్నాడు. ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్‌గా గంభీర్.. ఐపీఎల్లో చాలా మ్యాచ్‌ల్లో తలపడ్డ సంగతి తెలిసిందే.

రోహిత్ మా హకూనా మటాటా

'మాస్టర్ ఆఫ్ క్రికెట్‌కు నా బెస్ట్ విషెస్ తెలుపుకుంటున్నా. మమ్మల్నందరినీ గర్వపడేలా నీవు జాతీయ జట్టుకు సేవలందించావు. తర్వాతి తరానికి ఓ ఐకాన్ గా నిలిచిపోయావు' అని రైనా ట్వీట్ చేశాడు. ఇక రోహిత్ సతీమణి రితికా విష్ చేస్తూ.. సమ్మీ(రోహిత్ కుమార్తె సమారియా), నేను నిన్ను ప్రేమిస్తున్నాం. మా హకూనా మటాటాగా నువ్వు మాతో ఉన్నందుకు సంతోషిస్తున్నాం అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రాబిన్ ఉతప్ప తదితర క్రికెటర్లు రోహిత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. రోహిత్‌తో కలిసి దిగిన ఫోటోలు పోస్టు చేశారు.

Story first published: Saturday, April 30, 2022, 14:53 [IST]
Other articles published on Apr 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+