Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir: సీనియర్లు వచ్చినా వరల్డ్ కప్ టీమిండియా ప్లేయింగ్ 11లో ఇషాన్ ఉండాల్సిందే.. ఎందుకంటే?

Gautam Gambhir says Ishan Kishan should be included in Playing 11 as he has a fearless approach

సీనియర్ టాపార్డర్ బ్యాటర్లు అయిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీమిండియాలోకి తిరిగి వచ్చినా సరే.. టీ20 ప్రపంచ కప్ 2022కోసం ప్లేయింగ్ 11లో ఇషాన్ కిషన్‌ను ఆడించాలని భారత మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్‌లలో బ్యాక్‌ఫుట్ షాట్‌లు ఆడే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ నైపుణ్యం ఉపయోగపడుతుందని గంభీర్ పేర్కొన్నాడు.

ఇషాన్ కిషన్ పరుగులు చేసినా, చేయకపోయినా అతను నిర్భయంగా ఆడే విధానం, ఎక్స్-ఫాక్టర్ కోసం ఇషాన్ కిషన్‌ను తప్పనిసరిగా తుదిజట్టులో ఉంచాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

రన్స్ చేసినా, చేయకపోయినా అతన్ని ఆడించాలి

రన్స్ చేసినా, చేయకపోయినా అతన్ని ఆడించాలి

గంభీర్ మాట్లాడుతూ.. ' నా ప్రశ్న ఏమిటంటే.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి మళ్లీ తిరిగి వచ్చినప్పుడు.. తుది జట్టులోకి ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారా అని? అతన్ని తీసుకోవాలి. ఎందుకంటే టీ20లో ఎక్స్ ఫ్యాక్టర్, ఫియర్ లెస్ బ్యాటింగ్ విధానం గురించి మాట్లాడతారు. ఇషాన్ పరుగులు చేసినా.. చేయకపోయినా అతను చాలా నిర్భయంగా ఆడగలడు.

అతన్ని రోహిత్‌తో కలిసి ఓపెనింగ్లో బరిలోకి దించి.. మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్‌ని ఆడిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బౌన్సీ వికెట్లు ఉండే ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇషాన్ కిషన్ తుదిజట్టులో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అతను బ్యాక్‌ఫుట్‌ మీదుగా బౌండరీలు బాదగలడు. అతను లెంత్ బాల్స్‌ను బాగా హిట్ చేయగలడు. ఈ టీ20 ప్రపంచకప్‌ కోసం తప్పకుండా ఇషాన్ కిషన్‌ను తుది జట్టులో ఉంచాలని నేను భావిస్తున్నాను.' అని తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో రాణిస్తున్న ఇషాన్ కిషన్

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో రాణిస్తున్న ఇషాన్ కిషన్

ఇకపోతే ఇషాన్ కిషన్ ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మొదటి రెండు మ్యాచ్‌లతో పాటు సెకండాఫ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. అతను 14మ్యాచ్‌లలో 32.15సగటుతో 418 పరుగులు చేశాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌‌లో కూడా ఇషాన్ కిషన్ రాణిస్తున్నాడు. తొలి రెండు గేమ్‌లలో 159కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో కిషన్ 110పరుగులు చేశాడు.

ఎటాకింగ్ గేమ్‌తో బౌలర్ల పదును తగ్గించేలా బ్యాటింగ్

ఎటాకింగ్ గేమ్‌తో బౌలర్ల పదును తగ్గించేలా బ్యాటింగ్

నిన్న జరిగిన రెండో టీ20లో మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు హిట్టింగ్ చేయడానికి నానా తంటాలు పడుతుండగా.. కిషన్ కేవలం 21బంతుల్లో 34పరుగులు చేశాడు. ఇక తొలి మ్యాచ్‌లోనూ ఈ పాకెట్ డైనమైట్ (76పరుగులు 48బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) విధ్వంసం రేపాడు. అతను ఉన్నంత సేపు బౌలర్ల పేస్ పదునును తగ్గించేలా ఎటాకింగ్ గేమ్ ఆడుతుండడం వల్ల మిగతా బ్యాటర్లకు కూడా కాస్త స్కోరు రాబట్టడం ఈజీ అవుతుంది.

ఈ సిరీస్లో రెండు T20 మ్యాచ్‌లలో ఇషాన్ పవర్‌ప్లేలో 41బంతుల్లో 55పరుగులు చేశాడు. ఈ సిరీస్ వచ్చే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియాకు అవసరమైన ఓపెనర్ కోసం ఓ అవకాశంగా భావించొచ్చు. ఇకపోతే ప్రోటీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 0-2తో వెనుకబడి ఉంది. ఇక జూన్ 14న మంగళవారం విశాఖపట్నంలో ఇండియా మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది.

Story first published: Monday, June 13, 2022, 16:04 [IST]
Other articles published on Jun 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+