మిస్సింగ్ పోస్టర్లపై స్పందించిన గంభీర్.. కాలుష్య సమావేశానికి ఎందుకు రాలేదంటే?

న్యూఢిల్లీ: మిస్సింగ్ పోస్టర్లపై భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్పందించారు. ఓ ప్రసార సంస్థతో ముందస్తు ఒప్పందం చేసుకోవడంతోనే కాలుష్యంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి హాజరుకాలేదని గంభీర్ వివరణ ఇచ్చాడు. 'గంభీర్ కనబడుటలేదు' అని ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో పోస్టర్లు అతికించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా గంభీర్ స్పందించాడు.

ఒప్పందం కారణంగానే వెళ్ళా:
గంభీర్ మీడియాతో మాట్లాడుతూ... 'ఏప్రిల్‌లో రాజకీయాల్లోకి వచ్చా. గత జనవరిలోనే ప్రసార సంస్థతో కాంట్రాక్టు కుదుర్చుకున్నా. కాలుష్య భేటీ ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు. అయితే ఒప్పందం కారణంగానే కామెంటరీ చేయడానికి ఇండోర్ వెళ్లా. నవంబర్ 11న నాకొక మెయిల్ వచ్చింది. సమావేశానికి హాజరుకాలేకపోతున్నందుకు గల కారణాలను అదే రోజు వివరించా' అని తెలిపాడు.

నా కర్తవ్యం ఏంటో తెలుసు:
'కాలుష్య సమావేశానికి రానందుకు నన్ను దూషించడం, విమర్శించడం వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య పరిష్కారం కాదు. అందరికంటే ముందుగానే కాలుష్యంపై మాట్లాడాను. నా కర్తవ్యం ఏంటో నాకు తెలుసు' అని గంభీర్ అన్నాడు. గంభీర్ ప్రస్తుతం జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు వ్యాఖ్యాతగా ఉన్న విషయం తెలిసిందే.

మిస్సింగ్ పోస్టర్లు:
ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో 'గంభీర్ కనబడుటలేదు' అని పలు పోస్టర్లు వెలిశాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గంభీర్ కనబడుటలేదు అని అర్ధం వచ్చేలా పోస్టర్లను చెట్లకు అంటించారు. 'ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడైనా చూశారా?. ఇండోర్‌లో జిలేబీ తింటుండగా చివరిసారి చూశాం. అతని కోసం ఢిల్లీ మొత్తం వెతుకుతోంది' అని ఆ పోస్టర్‌లలో రాశారు. ఈ పోస్టర్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గంభీర్ గైర్హాజరు:
దీపావళి ముందు నుంచి ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా ఉండడంతో.. పొల్యుషన్‌కు సంబంధించిన అంశంపై అర్బన్ డెవలప్‌మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నవంబర్ 15న కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎంపీలు, ప్రభుత్వాధికారులు హాజరుకాకపోవడంతో సమావేశాన్ని రద్దు చేశారు. సమావేశానికి ఎంపీ గంభీర్ కూడా రాలేదు. సమావేశానికి గైర్హాజరైన గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి తీవ్రంగా విమర్శించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications