బెన్ స్టోక్స్‌లాంటి ఆటగాడు భారత్‌లో ఒక్కడు కూడా లేడు: గౌతం గంభీర్

IPL 2020 Is Going To Change The Mood Of The Nation : Gautam Gambhir || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత తరం క్రికెట్‌లో స్టోక్స్ తరహా ఆటగాడు భారత్‌తో సహా ఏ జట్టులో లేడన్నాడు. అతను ఓ యూనిక్ ప్లేయరని కొనియాడాడు. ఆదివారం స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న గంభీర్.. ప్రస్తుత భారత జట్టులో స్టోక్స్‌తో పోల్చే ఆటగాడు ఒక్కడు కూడా లేడన్నాడు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైయినా దానికి తగ్గట్టు అతని ఆట చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపాడు.

ఒక్కడు కూడా లేడు..

ఒక్కడు కూడా లేడు..

‘ప్రస్తుత తరుణంలో భారత జట్టులోని ఏ ఆటగాడితో స్టోక్స్‌ను పోల్చలేం. ఎందుకంటే స్టోక్స్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. ఫార్మాట్‌కు తగ్గటు అతని ఆట చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుత క్రికెట్‌లో స్టోక్స్‌కు సరితూగే ఆటగాడు దరిదాపుల్లో కూడా లేడు. కానీ స్టోక్స్‌ లాంటి ఆటగాడు ప్రతీ జట్టుకు అవసరం. ప్రతీ కెప్టెన్‌కు అతని లాంటి క్రికెటర్‌ జట్టులో ఉండాలనేది డ్రీమ్‌గా ఉంటుంది.

 అతని ఆటకు అతనే సారథి..

అతని ఆటకు అతనే సారథి..

అంతటి విలువైన ఆటగాడు స్టోక్స్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఏ విభాగంలోనైనా స్టోక్స్‌కు సాటిరారు. అతని ఆటకు అతనే కెప్టెన్‌గా భావిస్తాడు. నువ్వు కెప్టెన్ కాకున్నా.. అలా ఎవరూ పిలవకున్నా.. నీ ప్రదర్శన వరకు మాత్రం నీకు నువ్వే సారథిగా ఉండాలి. స్టోక్స్ కూడా దీన్నే అనుసరిస్తాడు. అందుకే చాలా మంది ఆటగాళ్లు స్టోక్స్‌లా ఉండాలనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత తరంలోనే అతనిలాంటి ఆటగాడు ఒక్కడు కూడా లేడు.'అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

 ఇర్ఫాన్ పఠాన్ కూడా..

ఇర్ఫాన్ పఠాన్ కూడా..

ఇటీవల భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా బెన్‌స్టోక్స్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్ జట్టులో ఉంటే టీమిండియాకు తిరుగుండదని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ట్వీట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. అంటే భారత జట్టులో ఆల్‌రౌండర్లే లేరంటావా? పఠాన్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి పఠాన్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. యువరాజ్ సింగ్ ఉండేవాడు కానీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని సమాధానమిచ్చాడు. దీనికి 'యువీ... నాకు తెలుసు నీ నుంచి ఇలాంటి సమాధానం వస్తుంది'అని బదులిచ్చాడు. దీనికి పటాన్ 'నాగురించి నీకు బాగా తెలుసు బ్రదర్'అంటూ కామెంట్ చేశాడు.

సిరీస్ కైవసం దిశగా..

సిరీస్ కైవసం దిశగా..

ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో సారథిగా విజయాన్నందించకపోయినా.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక రెండో టెస్ట్‌లోనైతే అతని విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు.. రెండు ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో (78 నాటౌట్) అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో కీలక మూడు వికెట్లు తీసి అద్భుత విజయాన్నందించాడు. దీంతో ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టులో గెలుపు దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్‌ సిరీస్‌ అందుకోవడానికి కొద్ది దూరంలో నిలిచింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 27, 2020, 12:51 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X