For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచ క్రికెట్‌లో జడేజానే బెస్ట్ ఫీల్డర్.. జడ్డూను మించిన సేఫ్‌ హ్యాండ్స్‌ లేవు‌'

Gautam Gambhir said There is no better fielder than Ravindra Jadeja in world cricket

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో రవీంద్ర జడేజానే బెస్ట్ ఫీల్డర్ అని టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసించారు. జడేజాకన్నా గొప్ప ఫీల్డర్ మరొకరు లేరని తేల్చిచెప్పారు. తాజాగా ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియాలో అందరు ఆటగాళ్లు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడటం లేదని, దీంతో ఫీల్డింగ్‌ ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయన్నారు. జడ్డూ భారత్ తరఫున 49 టెస్టులు, 165 వన్డేలు, 49 టీ20ల ఆడాడు. మరోవైపు 170 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.

ప్రస్తుతం టీమిండియాలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో మంది బెస్ట్‌ ఫీల్డర్లు ఉన్నప్పటికీ.. రవీంద్ర జడేజానే అందరికంటే అత్యుత్తమని గౌతమ్ గంభీర్అ భిప్రాయపడ్డారు. 'ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో రవీంద్ర జడేజానే అత్యుత్తమ ఫీల్డర్‌. అంతేకాకుండా జడ్డూ జట్టుకు అవసరమైన నాణ్యమైన ఆల్‌రౌండర్‌. కీలక సమయంలో బ్యాట్‌తో రాణించి మెప్పించగలడు. బంతితో మాయ చేయగలడు. అదేవిధంగా మెరుపు ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు' అని బీజేపీ ఎంపీ గౌతమ్ అన్నారు.

'ఔట్‌ఫీల్డ్‌, కవర్స్‌లో జడేజాను మించిన ఫీల్డర్‌ మరోకరు ఉండరు. గల్లీ, స్లిప్‌లో అతడు ఎక్కువగా ఫీల్డింగ్‌ చేయడు. అయినా బ్యాట్స్‌మన్‌ కొట్టిన బంతిని ఏ ఫీల్డింగ్‌ పొజిషన్‌ నుంచైనా వికెట్లపైకి నేరుగా విసరగల సామర్థ్యం అతడికి ఉంది. ఇక క్యాచ్‌లు అందుకోవడంలో అతడివి సేఫ్‌ హ్యాండ్స్‌. బంతి అతడి చేయి దాటి పక్కకుపోదు. బహుశా అందుకే అనుకుంటా జడేజా బెస్ట్‌ పీల్డర్‌ అని కీర్తింపబడుతున్నాడు' అని గంభీర్‌ పేర్కొన్నారు. గంభీర్ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20ల ఆడారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జడేజానే అద్భుతమైన ఫీల్డర్ అని స్పష్టం చేశాడు. ఆ మధ్య స్టార్‌స్పోర్ట్స్ ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతాలో 'టీమిండియా బెస్ట్‌ ఫీల్డర్'‌ ఎవరనే దానిపై ఓ పోల్ పెట్టింది. 'ఒకవేళ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకే షాట్‌లో స్టంప్స్ కొట్టాలంటే.. అప్పుడు జడేజా, విరాట్‌లో ఎవరిని ఎంచుకుంటారు?' అని ప్రశ్నించింది. దీనికి అభిమానులు తమకు తోచిన సమాధానం చెప్పారు. కొందరు జడేజా పేరు చెప్పగా.. మరికొందరూ విరాట్ పేరు సూచించారు. అయితే ఈ క్వశ్చన్ పోల్ చూసిన భారత కెప్టెన్ మాత్రం జడేజా పేరును సూచించాడు. 'ఎవరైనా జడేజానే ఎంపికచేసుకుంటారు. ఎప్పుడైనా అతనే బెస్ట్ ఫీల్డర్. ఇక ఈ చర్చను ఆపండి' అని సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా జడ్డూకన్నా బెస్ట్ ఫీల్డర్ లేదన్నాడు.

Story first published: Saturday, June 20, 2020, 16:16 [IST]
Other articles published on Jun 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+