న్యూజిలాండ్‌కు కూడా విజేతగా నిలిచే అర్హత ఉంది: గంభీర్

ఢిల్లీ: 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో పాటు న్యూజిలాండ్‌కు కూడా విజేతగా నిలిచేందుకు పూర్తి అర్హత ఉందని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. గతేడాది జూలైలో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో తొలుత కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు టై కాగా.. ఆ తర్వాత నిర్వహించిన సూపర్ ఓవర్లోనూ రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ జట్టును విజేతగా ప్రకటించారు.
ఆ సమయంలో ఐసీసీపై క్రికెట్ మాజీలు అసంతృప్తి వ్యక్తం చేసారు. కొందరు ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు నిర్వహించాలి అనగా.. మరికొందరు న్యూజిలాండ్‌ను కూడా విజేతగా ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డారు. తాజాగా గంభీర్ సైతం తాజాగా ఓ టీవీ షోలో కివీస్ కూడా 2019 ప్రపంచకప్ విజేతగా నిలువాల్సిందని చెప్పాడు. 'ప్రపంచకప్‌లో కివీస్ కూడా సంయుక్త విజేతగా నిలువాల్సింది. ప్రపంచ విజేత అనే ట్యాగ్ ఆ జట్టుకు ఉండాల్సింది. కానీ దురదృష్టకరం' అని అన్నాడు.
'మొత్తంగా చూసుకుంటే న్యూజిలాండ్‌కు మంచి రికార్డు ఉంది. మెగా టోర్నీలో నిలకడైన ప్రదర్శన చేసింది. గతేడాది ప్రపంచకప్ ముందు, తర్వాత ఆ జట్టు బాగా ఆడింది. విశ్వటోర్నీలోనూ రన్నరప్‌గా నిలిచింది. ఏ పరిస్థితుల్లో ఆడినా కివీస్ జట్టు పోటీనిస్తుంది. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది' అని గంభీర్ చెప్పాడు. మాజీ ఓపెనర్ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఖరి బంతి వరకూ పోరాడిన ఇంగ్లండ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ కూడా వికెట్ నష్టానికి సరిగ్గా 15 పరుగులే చేయడంతో మ్యాచ్ మళ్లీ టై అయ్యింది. దీంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లండ్ జట్టుని విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్‌లో కలిపి ఇంగ్లండ్ మొత్తం 26 (ఫోర్లు, సిక్స్‌లు) కొట్టగా.. న్యూజిలాండ్ 17 మాత్రమే చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications