న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ తండ్రి కారు చోరీ!!

Gautam Gambhirs fathers Car stolen from outside his home in Delhi

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ తండ్రి కారు చోరీకి గురైంది. గంభీర్‌ ఇంటిముందు పార్కు చేసిన తండ్రి దీపక్‌ గంభీర్‌కు చెందిన ఎస్‌యూవీ కారును గురువారం దొంగలు ఎత్తుకెళ్లారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని గంభీర్‌ ఇంటిముందు కారు పార్కు చేయగా.. గురువారం తెల్లవారుజామున చోరీకి గురైంది. ఈ ఘటనపై ఎంపీ గంబీర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఐసీసీ చైర్మన్‌ రేసులో గంగూలీ లేడు.. కానీ..: అరుణ్‌ ధుమాల్‌ఐసీసీ చైర్మన్‌ రేసులో గంగూలీ లేడు.. కానీ..: అరుణ్‌ ధుమాల్‌

ఈ ఘటనపై ఢిల్లీ సెంట్రల్ డీసీపీ మాట్లాడుతూ... 'రాజేంద్రనగర్‌లోని గంభీర్‌ ఇంటిముందు కారు పార్కు చేయగా గురువారం తెల్లవారుజామున చోరీకి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. ఇప్పటికే పలు బృందాలను ఏర్పాటు చేసి దొంగను గుర్తించే పనిలో ఉన్నాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. అతి త్వరలోనే దొంగలను పట్టుకుంటాం. ఈ విషయంపై గౌతీతో మాట్లాడాం' అని తెలిపారు. గంభీర్‌ రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో తండ్రితోనే కలిసి ఉంటున్నారు.

మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడారు. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో గౌతమ్ గంభీర్‌ సభ్యులు. ఫైనల్లో 75 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. అలాగే 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా జట్టులో కూడా గంభీర్‌ సభ్యుడిగా ఉండటమే కాకుండా.. కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. గౌతీ (97: 122 బంతుల్లో 9x4) తృటిలో సెంచరీ మిస్ అయ్యారు. అయితే ఈ రెండు మెగా టోర్నీలకు ఎంఎస్ ధోనీనే కెప్టెన్‌.

టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోసం ఏమైనా చేస్తానని బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఇటీవల తెలిపారు. తన ఆల్‌టైమ్ అత్యుత్తమ కెప్టెన్ కుంబ్లేనే అని తెలిపిన ఈ పొలిటీషన్ కమ్ మాజీ క్రికెటర్.. అతని కోసం తన జీవితాన్నైనా త్యాగం చేస్తానన్నారు. కుంబ్లే భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని, అతనిచ్చిన సపోర్ట్ మరే కెప్టెన్ తనకు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

Story first published: Friday, May 29, 2020, 14:30 [IST]
Other articles published on May 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X