వీలైతే డక్ లేకపోతే పక్కకు తప్పుకొని వెళ్లిపో: జహీర్‌కు గంభీర్ సలహా

హైదరాబాద్: టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేల వివాహం చాలా సింపుల్‌గా జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ముంబైలోని ఓ కోర్టు ప్రాంగణంలో సన్నిహితుల మధ్య వీరిద్దరూ రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఒక్కటైన సందర్భంగా అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ రంగాలకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాత్రం కాస్తంత వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. 'వివాహ బంధంతో ఒకటైన జహీర్, సాగరికకు నా శుభాకాంక్షలు. మొత్తానికి జహీర్‌ని కూడా బౌన్స్ చేయగలిగే వ్యక్తి దొరికింది. బ్రో(జహీర్) నా అనుభవంతో చెబుతున్న ఇప్పటి నుంచి హుక్ లేక పుల్ షాట్లకు ట్రై చేయకు... వీలైతే డక్ లేకపోతే పక్కకు తప్పుకొని వెళ్లిపో' అని గంభీర్ ట్వీట్ చేశాడు. ఇక తన సలహా సరైనదేనా అని యువరాజ్, హర్భజన్‌ను ట్యాగ్ కూడా చేయడం విశేషం.
గంభీర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు నవంబర్ 27న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రికెటర్లకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications