ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నేపథ్యంలో భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సోషల్ మీడియా సెగ తెగిలింది. సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు, నెటిజన్లు అతడిపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. కోహ్లీ-రోహిత్ కు సంబంధించి గంభీర్ చేసిన ఓ పోస్ట్‌ను ట్రోల్ చేస్తూ అతడిపై విరుచుకుపడుతున్నారు! ఇంతకీ ఏం జరిగిందంటే ?
సాధారణంగా క్రికెటర్లు బ్రాండ్ ప్రమోషన్స్ చేయడం సహజమే. అలానే గంభీర్ కూడా ఓ ఫాంటసీ క్రికెట్ యాప్ కు ప్రమోషన్ చేశాడు. దానికి సంబంధించి తన అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ అది అతడిపై తీవ్ర విమర్శలకు దారీ తీసింది. ఆ పోస్ట్ లో.. "రోకో(రోహిత్ - కోహ్లీ) జోడీ.. భారత్ కుమరో ఛాంపియన్స్ వన్డే ట్రోఫీని తెచ్చిపెడుతుందా? యస్ ఆర్ నో సమాధానం చెప్పండి. రియల్ 11లో ట్రేడ్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి పైసలు గెలవండి" అంటూ రాసి ఉంది. అలానే యాప్ ను డౌన్ లౌడ్ చేసి సైన్ అప్ అవ్వండి రూ.100 గెలవండి అని కూడా రాసి ఉంది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులను గంభీర్ ను ఏకీపారేస్తున్నారు. 'ఇండియన్ టీమ్ హెడ్ కోచ్.. గ్యాంబ్లింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నాడు'. 'దేశం మొత్తం టీమిండియా ట్రోఫీ గెలిచి తిరిగొస్తుందని నమ్మకంతోనే ఉంటే, హెడ్ కోచ్ మాత్రం గెలుస్తారా? అంటూ తిరిగి ప్రశ్నించడం హాస్యంగా ఉంది', 'గంభీర్.. నువ్వు హెడ్ కోచ్ స్థానంలో ఉన్నావ్ గుర్తుపెట్టుకో', 'ఒక ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ ఫాంటసీ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఎంత వరకు సమంజసం బీసీసీఐ, ఇది కాన్‌ప్లిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్(పరస్పర విరుద్ధ ప్రయోజనాల) కేసు అని స్పష్టంగా అర్థమవుతోంది, ప్లేయింగ్ ఎలెవన్ నిర్ణయాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది', 'సిగ్గు ఉందా ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నావ్' అంటూ విచ్చలవిడిగా కామెంట్లు చేస్తున్నారు.
Kya RO-KO ki jodi Bharat🇮🇳 ko ek aur Champions ODI trophy jeeta paayegi?🤔
— Gautam Gambhir (@GautamGambhir) March 9, 2025
Real11 par Trade karo. Aise hi aur sawalo ke jawab Yes✅/❌No mein do aur dheero inaam jeeto!💸#CricketX #Real11 #INDvsNZ @Real11official
Download Link - https://t.co/jFv1ZXcBhp
Signup Code- GAMBHIR &… pic.twitter.com/AXtvOtZwZi