న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జేఎన్‌యూ విద్యార్థులపై దాడి సిగ్గుమాలిన చర్య.. కారకులను కఠినంగా శిక్షించాలి!!

Gautam Gambhir, Rohan Bopanna Among Sportspersons To Condemn JNU Violence

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణం ఆదివారం ఉద్రిక్తంగా మారిన సంగ‌తి తెలిసిందే. ముసుగులు ధరించిన కొందరు దుండగులు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందించారు.

నేడు శ్రీలంకతో భారత్‌ రెండో టీ20.. గబ్బర్‌కు పరీక్ష!!నేడు శ్రీలంకతో భారత్‌ రెండో టీ20.. గబ్బర్‌కు పరీక్ష!!

తాజాగా పలువురు మాజీ క్రికెటర్లు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఈ ఘటనను ఖండించారు. భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్, మాజీ బౌలర్ ఇర్ఫాన్‌ పఠాన్, క్రికెటర్ మనోజ్‌ తివారి, స్టార్ టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న, బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల ట్విట్టర్‌లో స్పందిస్తూ జేఎన్‌యూ ఘటనను ఖండించారు.

'వర్సిటీ క్యాంపస్‌లో ఇలాంటి హింసాత్మక ఘటనలు మన దేశ సంస్కృతికి పూర్తి విరుద్ధం. కారణాలేవైనా విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు చేయడం సరికాదు. దుండగులను కఠినంగా శిక్షించాల్సిందే' అని గంభీర్ ట్వీట్ చేసాడు.

'జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన ఘటన దారుణమైనది. క్యాంపస్‌లో ఉన్న హాస్టళ్లలో చొరబడి ఇలా విచక్షణా రహితంగా దాడిచేయడం మన దేశ ప్రతిష్టను దిగజార్చుతుంది' అని ఇర్ఫాన్‌ పఠాన్‌ రాసుకొచ్చాడు.

'జేఎన్‌యూ విద్యార్థులపై దాడి సిగ్గుమాలిన చర్య. ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది' అని రోహన్‌ బోపన్న ట్వీటారు.

'ఒకరి ఆలోచన వల్ల జేఎన్‌యూ క్యాంపస్‌లో అలజడి చోటు చేసుకుంది. దాని వల్ల ఎంతో మంది గాయాలపాలు కావాల్సి వచ్చింది. డగులను కఠినంగా శిక్షించాలి' అని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు.

Story first published: Tuesday, January 7, 2020, 9:39 [IST]
Other articles published on Jan 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X