For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మీరనుకున్నట్టు ధోనీ మిస్టర్‌ కూల్‌ కాదు.. సహనం కోల్పోవడం నేను చాలాసార్లు చూశా'

Gautam Gambhir reveals instances when Mr Cool MS Dhoni lost his cool

ఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి మరోపేరు 'మిస్టర్‌ కూల్'‌. మైదానంలో ప్రశాంతతో తన పని తాను చేసుకుపోతాడు కాబట్టి ఆ బిరుదు ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో తన కను సైగలతో ఆటగాళ్లకు ధోనీ సూచనలు ఇవ్వడం చూశాం కానీ.. సహనం కోల్పోవడం మాత్రం ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. అయితే ప్రజలు అనుకున్నట్లు ధోనీ మిస్టర్‌ కూల్‌ ఏమీ కాదని ఏళ్లపాటు అతనితో ఆడిన మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అంటున్నాడు.

మిస్టర్‌ కూల్‌ కాదు:

మిస్టర్‌ కూల్‌ కాదు:

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం క్రీడలన్నీ నిలిచిపోవడంతో గౌతం గంభీర్‌.. ఓ క్రికెట్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా ధోనీపై స్పందిస్తూ.. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ మహీ‌ సహనం కోల్పోవడం చూశానన్నాడు. 'ధోనీ ఎప్పుడూ సహనం కోల్పోవడం చూడలేదని ప్రజలు అంటుంటారు. కానీ, పలు సందర్భాల్లో చూశా. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ లాంటి ఈవెంట్లలో మేం సరిగ్గా రాణించనప్పుడు మహీ సహనం కోల్పోయాడు. అది నేను చూశాను' అని గంభీర్‌ తెలిపాడు.

నా కంటే చాలా కూల్:

నా కంటే చాలా కూల్:

'ఎంఎస్ ధోనీ కూడా మనిషే కాబట్టి కోపం అనేది సహజం. ఇక ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున కెప్టెన్‌గా చేస్తున్న ధోనీ.. ఎవరైనా క్యాచ్‌ వదిలేసిన క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ధోనీ నిజంగానే చాలా ప్రశాంతంగా ఉంటాడు. భారత్‌కు కెప్టెన్లుగా చేసిన మిగతా వారి కంటే కూల్‌ అనేది వాస్తవం. అంతేకానీ ప్రతీ విషయంలోనూ మహీ కూల్‌ కాదు. అయితే నా కంటే చాలా కూల్‌' అని గంభీర్‌ పేర్కొన్నాడు.

రెండు ప్రపంచకప్‌లలో గంభీర్‌:

రెండు ప్రపంచకప్‌లలో గంభీర్‌:

2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో గౌతమ్ గంభీర్‌ సభ్యుడు. అలాగే 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా జట్టులో కూడా గంభీర్‌ సభ్యుడిగా ఉండటమే కాకుండా.. కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 97 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ రెండు మెగా టోర్నీలకు ధోనీనే కెప్టెన్‌. 2014 న్యూజిలాండ్ పర్యటనలో ఓ బౌన్స‌ర్ వేసి ధోనీతో చివాట్లు తిన్న విషయాన్ని పేసర్‌ మహ్మద్‌ షమీ ఇటీవల గుర్తు చేసుకున్నాడు. అంతకుముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఓ సంఘటన చెప్పాడు.

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ప్రస్తుతం రాహుల్ టీ20 ప్రపంచకప్ రేసులో ఉన్నాడు.

డైలమాలో ధోనీ క్రికెట్ భవిష్యత్తు:

డైలమాలో ధోనీ క్రికెట్ భవిష్యత్తు:

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.

Story first published: Friday, May 15, 2020, 16:54 [IST]
Other articles published on May 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+