Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సారీ గంభీర్: అభిమానులకు వివరణ ఇచ్చిన కేకేఆర్ సీఈఓ (వీడియో)

Gautam Gambhir requested if we would refrain from bidding for him or using RTM: KKR CEO Venky Mysore

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా జట్టు అనగానే అభిమానులకు మొదట గుర్తుకు వచ్చేది గౌతం గంభీర్. గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా జట్టు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించింది. అలాంటి గంభీర్‌ను ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అతడిని సొంత జట్టు కోల్‌కతా తీసుకోకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.

కోల్‌కతా జట్టుని రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలబెట్టిన గంభీర్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అభిమానులు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోల్‌కతాకు వ్యతిరేకంగా ట్వీట్లు పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ వివరణ ఇచ్చుకున్నారు.

గంభీర్‌కు సారీ చెబుతూ కేకేఆర్‌ జట్టు వదులుకోవడానికి అతడే కారణమని చెప్పాడు. 'ఈ వేలంలో మాజీ కెప్టెన్ గంభీర్‌ను తీసుకోవాలని ముందుగానే కేకేఆర్ యాజమాన్యం అనుకుంది. అతడిపై మాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. కానీ వేలానికి ముందు గంభీర్ తమకు కొన్ని విషయాలు చెప్పాడు. తన కోసం వేలంలో ఆసక్తి చూపించవద్దని, ఆర్టీఎం (రైట్‌ టు మ్యాచ్) ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించవద్దని అన్నాడు. గంభీర్‌ ప్లాన్స్ ఎలా ఉన్నాయో.. అతడు దేని కోసం ఎదురుచూస్తున్నాడో మాకు తెలియదు. దీంతో గంభీర్‌కు ఏ విధంగా సాయం చేయలేకపోయామని, సారీ గంభీర్ అని' చెప్పుకొచ్చాడు.

కాగా, బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన వేలంలో గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు రూ.2.8 కోట్లతో కొనుగోలు చేసింది.

కోల్‌కతా నైట్ రైడర్స్
1. సునీల్ నరైన్ (రూ.8.5 కోట్లు - Retained)
2. అండ్రీ రసెల్ (రూ.7 కోట్లు-Retained)
3. మిచెల్ స్టార్క్ (9.4 కోట్లు)
4. క్రిస్ లిన్ (9.6 కోట్లు)
5. దినేష్ కార్తీక్ (రూ.7.4 కోట్లు)
6. రాబిన్ ఉతప్ప (రూ.6.4 కోట్లు-RTM)
7. పియూష్ చావ్లా (రూ.4.2 కోట్లు-RTM)
8. కుల్‌దీప్ యాదవ్ (రూ.5.8 కోట్లు -RTM)
9. శుభ్‌మాన్ గిల్ (రూ.1.8 కోట్లు)
10. ఇషాంక్ జగ్గి (రూ.20 లక్షలు)
11. నితీష్ రాణా (రూ.3.4 కోట్లు)
12. కమలేష్ నగర్‌కోటి (రూ.3.2 కోట్లు)
13. వినయ్ కుమార్ (రూ.కోటి)
14. అపూర్వ్ వాంఖెడె (రూ.20 లక్షలు)
15. రింకు సింగ్ (రూ.80 లక్షలు)
16.శివమ్ మావి (రూ.3 కోట్లు)
17. కేమరూన్ డెల్‌పోర్ట్ (రూ.30 లక్షలు)
18. మిచెల్ జాన్స‌న్ (రూ.2 కోట్లు)
19. జేవ‌న్ సియ‌ర్‌లెస్ (రూ.30 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 10:51 [IST]
Other articles published on Jan 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+