Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: గంభీర్‌తో గందరగోళం.. మరో ప్లేయర్‌పై వేటు!

కోచ్‌గా తన సరికొత్త కెరీర్ అదిరేలా ఆరంభించాలని శ్రీలంక పర్యటనను గౌతమ్ గంభీర్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్ ఎంపికైన విషయం తెలిసిందే. జులై 27వ తేదీ నుంచి మొదలుకానున్న లంక పర్యటనతో గంభీర్ తన యాక్షన్ మొదలుపెట్టనున్నాడు.

అయితే శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లనే లక్ష్యంగా కాకుండా గంభీర్ సుదీర్ఘ ప్రణాళికలు వేస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పు సిద్ధం చేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నయా కోచ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాడని తెలుస్తోంది.

Gautam Gambhir Reportedly Decides Against Appointing KL Rahul as Captain for ODI Series Against Sri Lanka

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో టీ20ల కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య బాధ్యతలు చేపడతాడనుకున్న వేళ సూర్యకుమార్ యాదవ్ పేరు రేసులోకి వచ్చింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌తో పాటు వచ్చే టీ20 వరల్డ్ కప్-2026 వరకు సూర్యనే పొట్టి ఫార్మాట్‌లో భారత్ కెప్టెన్‌గా కొనసాగుతాడని సమాచారం. అయితే గంభీర్ రాకతో మరొక స్టార్ ప్లేయర్ ఆశలు ఆవిరయ్యాయని తెలుస్తోంది.

రోహిత్, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో, లంకతో వన్డే‌లకు కేఎల్ రాహుల్ సారథి బాధ్యతలు అందుకుంటాడని భావించారంతా. కానీ రాహుల్‌ను కెప్టెన్ చేయడం గంభీర్‌కు ఇష్టం లేదని సమాచారం. ఆ కారణంగానే లంక వన్డేలకు రోహిత్‌ను తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని గంభీర్ కోరాడని జాతీయ మీడియా పేర్కొంది. కొత్తగా బాధ్యతలు అందుకున్న వేళ పూర్తిస్థాయి జట్టు ఉండాలని గంభీర్ కోరుకోవడం మరో కారణమని రాసుకొచ్చింది.

కాగా,ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాహుల్, గంభీర్ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. రాహుల్ కెప్టెన్‌గా, గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రెండు సీజన్లలో లక్నో ప్లేఆఫ్స్‌కు చేరింది. కానీ ట్రోఫీ ఆశ తీరలేదు.

Story first published: Thursday, July 18, 2024, 11:34 [IST]
Other articles published on Jul 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+