న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు ఫార్మాట్లలో కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్ అదే: గంభీర్‌

Gautam Gambhir Rates Virat Kohli’s Unbeaten 183 vs Pakistan as His Best Knock Across All Formats

ఢిల్లీ: 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సాధించిన 183 పరుగుల ఇన్నింగ్స్‌ అత్యుత్తమమైనదిగా భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్‌ పరిగణించాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటని ప్రశంసించాడు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఫార్మాట్‌ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. పిచ్ ఎక్కడిదైనా పరుగుల వరద పారించగలడు. అండర్‌ 19 స్థాయిలోనే టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన కోహ్లీ.. తర్వాత జాతీయ జట్టులో స్థానం సంపాదించి రికార్డుల మోత మోగిస్తున్నాడు. తన బ్యాటింగ్‌తో పాటు నాయకత్వంతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు నెలకొల్పుతున్నాడు.

 అక్టోబర్‌లో క్రికెట్‌ పరిస్థితి దారుణంగా ఉంటుంది: ద్రవిడ్‌ అక్టోబర్‌లో క్రికెట్‌ పరిస్థితి దారుణంగా ఉంటుంది: ద్రవిడ్‌

అత్యుత్తమ ఇన్నింగ్స్ అదే:

అత్యుత్తమ ఇన్నింగ్స్ అదే:

తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ... 'మూడు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు. అన్ని కోణాల్లోనూ అతని గొప్ప ఇన్నింగ్స్‌ల్లో పాకిస్థాన్‌పై సాధించిన 183 పరుగుల ఇన్నింగ్స్ ఒకటిగా నిలుస్తుంది' అని అన్నాడు. ఢాకా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో పాక్‌ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ కేవలం 148 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో 183 పరుగులు సాధించాడు. దీంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

కోహ్లీకి అంత అనుభవం కూడా లేదు:

కోహ్లీకి అంత అనుభవం కూడా లేదు:

'330 లక్ష్యాన్ని ఛేదించాలి. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భారత్‌ (0/1)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సమయంలో 330 పరుగుల ఛేధనలో 183 సాధించడం మామూలు విషయం కాదు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చేయడం సాధారణ విషయం అసలు కాదు. అప్పుడు కోహ్లీకి అంత అనుభవం కూడా లేదు. అయినా అద్భుతంగా ఆడాడు' అని గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో గంభీర్ 58 టెస్టుల్లో, 147 వన్డేల్లో, 37 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

తొలి ఓవర్‌లోనే షాక్:

తొలి ఓవర్‌లోనే షాక్:

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 329/6 భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు మహ్మద్‌ హఫీజ్ ‌(105), జాసిర్‌ జంషెద్‌ (112) శతకాలతో చెలరేగారు. యూనిస్ ఖాన్ (52) అర్ధ శతకం చేసాడు. ప్రవీణ్ కుమార్, అశోక్ దిండా చెరో రెండు వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో తొలి ఓవర్‌లోనే గౌతమ్‌ గంభీర్‌ పెవిలియన్ చేరాడు. సచిన్ టెండూల్కర్ (52), రోహిత్‌ శర్మ (68)లతో కలిసి విరాట్‌ కోహ్లీ (183) జట్టును ఆదుకున్నాడు. చివరలో సురేష్ రైనా (12), ఎంఎస్ ధోనీ (4) జట్టును విజయతీరాలు చేర్చారు.

Story first published: Saturday, August 1, 2020, 19:33 [IST]
Other articles published on Aug 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X