Gautam Gambhir: కోహ్లీ తొందరపడ్డావ్.. నీ అనాలోచిత నిర్ణయంతో ఆర్‌సీబీకి నష్టమే!

IPL 2021 : ఇప్పుడే ఎందుకు చెప్పావ్ Kohli ఎలాగో కప్ రాదనా ? Gambhir | RCB VS KKR || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ కెప్టెన్సీ విషయంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొందరపడ్డాడని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అతని అనాలోచిత నిర్ణయం ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో ఆర్‌సీబీ టీమ్ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపుతుందన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం గొప్ప నిర్ణమేనని, కాకపోతే ఇది సరైన టైమ్ కాదన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఇక ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే నా చివరి సీజన్ అంటూ విరాట్ కోహ్లీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు. తన కెరీర్ చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్‌సీబీతోనే ఉంటానన్నాడు.

ఇప్పుడెందుకు?

ఇప్పుడెందుకు?

కోహ్లీ నిర్ణయంపై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో స్పందించిన గంభీర్‌.. ఆర్‌సీబీ కెప్టెన్ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. 'సరిగ్గా సెకండాఫ్ లీగ్ ప్రారంభమైనప్పుడే విరాట్ కోహ్లీ ఇలా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఒకవేళ కచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే టోర్నీ పూర్తయ్యాక చెప్పాల్సింది.

ఎందుకంటే ఇప్పుడు అతను తీసుకున్న నిర్ణయం జట్టుపై ప్రభావం చూపుతుంది. కోహ్లీ కోసం ట్రోఫీ సాధించాలని ఆటగాళ్లపై ఒత్తిడి నెలకొంటుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ చాలా మంచి స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ నిర్ణయంతో వాళ్లని అనవసర ఒత్తిడికి గురిచేయడం ఎందుకు? నిజంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావిస్తే టోర్నమెంట్‌ పూర్తయ్యాక కూడా చెప్పొచ్చు' అని గంభీర్‌ పేర్కొన్నాడు.

సాహసోపేత నిర్ణయం..

సాహసోపేత నిర్ణయం..

అయితే, కోహ్లీ తీసుకున్నది సాహసోపేతమైన నిర్ణయమని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, రిటైర్మెంట్‌ ప్రకటించడం రెండూ పెద్ద నిర్ణయాలు. అవి పూర్తిగా వ్యక్తిగతం. ఈ రెండు విషయాల్లో ఏ ఆటగాడిమీదైనా వేరేవాళ్ల ప్రభావం ఉండకూడదు. అది ఎవరికి వారే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. ఈ నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్‌సీబీ ఆటగాళ్లు దీని గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలి.'అని గంభీర్‌ సూచించాడు.

 టాప్-3లో ఆర్‌సీబీ..

టాప్-3లో ఆర్‌సీబీ..

ఇక భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లో ఆర్‌సీబీ దుమ్మురేపింది. ఏడు మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌తో సెకండాఫ్ లీగ్‌ను ప్రారంభించనుంది. ఫస్టాఫ్ ఫామ్‌ను కొనసాగిస్తే యూఏఈలో కూడా ఆర్‌సీబీకి తిరుగుండదు. కెప్టెన్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ జట్టుకు అందుబాటులో ఉండటంతో బ్యాటింగ్ ఎప్పటిల్లాగే బలంగా ఉంది. పైగా, తమ జట్టు మంచి స్థానంలో ఉండటంతో వీరంతా స్వేచ్చగా ఆడనున్నారు. ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సేవలు కోల్పోవడం ఆర్‌సీబీకి కాస్త మైనస్.

అవకాశం ఎవరికో..?

అవకాశం ఎవరికో..?

అయితే సుందర్ ప్లేస్‌లో విరాట్ ఎవరిని ఫైనల్ ఎలెవన్‌లో తీసుకుంటాడో చూడాలి. బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీకి సమస్యల్లేవు. హైదరాబాద్ మహమ్మద్ సిరాజ్‌కు తోడుగా హర్షల్ పటేల్, సైనీ, జెమీసన్‌తో లైనప్ బలంగా ఉంది. ఫస్ట్ ఫేజ్‌లో అదరగొట్టిన హర్షల్‌పై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. ఇక, రెగ్యులర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫామ్ జట్టును కాస్త కలవరపెడుతోంది. యువ ప్లేయర్ మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన హసరంగా, చమీరా, టీమ్ డేవిడ్‌లో తుది జట్టులో ఎవరికి అవకాశం దొరకుతుందో చూడాల్సి ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 20, 2021, 15:04 [IST]
Other articles published on Sep 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X