Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ మరో డిమాండ్: ఆ విదేశీ బౌలరే కావాలని పట్టుబట్టిన నయాకోచ్!

భారత క్రికెట్ కోచింగ్‌లో గౌతమ్ గంభీర్ శకం మొదలైంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. సక్సెఫుల్ మెంటార్‌గా సత్తాచాటిన గంభీర్.. ఇక కోచ్‌గా తనదైన ముద్ర వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే సహాయక సిబ్బంది విషయంలో గంభీర్ డిమాండ్ జాబితా పెద్గగానే ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లుగా కొందరు పేర్లను బీసీసీఐకి గంభీర్ సిఫార్సు చేశారు. అయితే వారిలో కొందరిని బీసీసీఐ పక్కనపెట్టింది. మరికొందరు పేర్లను పరిశీలిస్తుంది. కోచ్ పదవి చేపట్టకముందే బీసీసీఐతో గంభీర్ సపోర్ట్ స్టాఫ్ విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. సహాయక సిబ్బంది ఎంపికలో తనకు స్వేచ్ఛను ఇవ్వాలని కోరాడు. దీనికి బీసీసీఐ అంగీకరించింది కూడా.

Gautam Gambhir Proposes Morne Morkel as Bowling Coach BCCI Yet to Decide

అయితే విదేశీ ఆటగాళ్ల పేర్లను గంభీర్ సిఫార్సు చేయడంపై మాత్రం బీసీసీఐ సానుకూలంగా స్పందించట్లేదు. ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరును గంభీర్ సూచించగా భారత క్రికెట్ బోర్డు తిరస్కరించింది. కాగా, తాజాగా మరో విదేశీ ప్లేయర్‌ను గంభీర్ బౌలింగ్ కోచింగ్‌గా సిఫార్సు చేశాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నె మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాలని గంభీర్ ప్లాన్ చేస్తున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్‌లో మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో గంభీర్ మోర్కెల్‌తో కలిసి పనిచేశాడు. దీంతో మోర్కెల్‌కు బౌలింగ్ బాధ్యతలు ఇవ్వాలని గంభీర్ అభిప్రాయపడుతున్నాడు. బౌలింగ్ కోచ్ రేసులో వినయ్ కుమార్, లక్ష్మిపతి బాలాజీ పేరు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది.

కాగా, మోర్కెల్ గత వన్డే వరల్డ్ కప్ వరకు పాకిస్థాన్‌కు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అతను 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. మరోవైపు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌ కోచ్ అభిషేక్ నాయర్‌ ఎంపిక దాదాపు ఖాయమైంది. ఫీల్డింగ్ కోచ్‌‌గా టి దిలీప్‌నే కొనసాగించాలని చూస్తున్నారు. మరో కొన్ని రోజుల్లో సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెలాఖరులో ఉన్న శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్ యాక్షన్ మొదలుకానుంది.

Story first published: Friday, July 12, 2024, 11:33 [IST]
Other articles published on Jul 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+