ఆసీస్ మీద గెలవకుంటే కచ్చితంగా ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవదు : గౌతం గంభీర్

రాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాను గనుక ఓడించలేకపోతే టీ20ప్రపంచకప్‌ను టీమిండియా గెలవలేదని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. సెప్టెంబర్ 20న ఆసీస్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌తో జరిగే ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇండియా గెలిస్తేనే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోగలదని గంభీర్ అన్నారు. అలాగే 2007టీ20 ప్రపంచకప్‌లో అలాగే 2011లో ఆసీస్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సాధించిన విజయాలను కూడా ఈ సందర్భంగా గంభీర్ ప్రస్తావించాడు.
'నేను ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ మరోసారి చెబుతున్నాను. ఆస్ట్రేలియాను ఓడించకపోతే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవదు. 2007 టీ20 ప్రపంచకప్ చూడండి. సెమీఫైనల్‌లో మేం ఆసీస్‌ను ఓడించాం. 2011 వన్డే ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆసీస్‌ను ఓడించాం. ఆస్ట్రేలియా అత్యంత పోటీనిచ్చే జట్లలో ఒకటి. ఏదైనా బిగ్ టోర్నీలో గెలవాలంటే తప్పకుండా ఆ జట్టును ఓడించాల్సిందే' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ ఒక్క మ్యాచ్ ఆడగానే అతన్ని ఓపెనర్‌గా బరిలోకి దింపాలనే ఆలోచనలు చేయడం, అలాంటి చర్చలు పెట్టడం మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు ఎంతటి అభద్రతా భావాన్ని కలిగిస్తావో ఊహించుకోవాలని చెప్పాడు. వ్యక్తుల కంటే సమిష్టిగా జట్టు ఎలా అభివృద్ధి చెందుతుందనే దాని గురించే చర్చలు జరగాలని గంభీర్ తెలిపాడు. 'మన ఇండియాలో ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఎవరైనా బాగా ఆడటం ప్రారంభించగానే.. రకరకాల డిస్కసన్స్ మొదలవుతాయి. ఉదాహరణకు చివరి గేమ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన వెంటనే.. రాహుల్, రోహిత్ చాలా కాలం పాటు జట్టుకు చేసిన వాటిని మనం మరచిపోతాం. కోహ్లీని ఓపెనింగ్ చేయించాలని మీరు మాట్లాడితే కేఎల్ రాహుల్ విషయంలో ఏమి జరుగుతుందో ఊహించండి. అతను ఎంత అభద్రతా భావానికి గురవుతాడో ఊహించండి. కేఎల్ రాహుల్ వరల్డ్ కప్ టీంలో ఉన్నాడు. ఇక తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై నేను పరుగులు చేయకపోతే నా స్థానంలో విరాట్ కోహ్లీని తీసుకుంటే ఎలా అనే ఓ క్వశ్చన్ తలెత్తి కాస్త ఇబ్బంది పడతాడు. అందుకే ఇలాంటి ఆలోచనలు, డిస్కషన్లు వద్దు. వ్యక్తుల కంటే టీమిండియా ఎలా మెరుగవ్వాలనే విషయమే ఆలోచించండి' అని గంభీర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications