Asia Cup Final: శ్రీలంక విజయానంతరం గ్రౌండ్లో సర్‌ప్రైజ్ చేసిన గంభీర్..! లంక ఫ్యాన్స్ మనసు దోచుకున్న గౌతీ

ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్ మీద శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ట్రోఫీని ఒడిసిపట్టింది. ఈ మ్యాచ్ అనంతరం గ్రౌండ్లో భారత మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ శ్రీలంక అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. గ్రౌండ్లోకి వెళ్లిన గంభీర్ శ్రీలంక జాతీయ జెండాను పట్టుకుని గెలుపు సూచకాన్ని ప్రదర్శించాడు. దీంతో స్టేడియంలో ఉన్న శ్రీలంక అభిమానులు కేకలతో ఉర్రూతలూగించారు. ఇక గంభీర్ శ్రీలంక విజయాన్ని ఆస్వాదిస్తూ.. లంక అభిమానులను సర్ ప్రైజ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. గంభీర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నాడు. వీడియో కింద 'సూపర్ స్టార్ టీమ్.. నిజంగా ట్రోఫీ గెలవడానికి శ్రీలంక అన్నివిధాలా అర్హత కలిగి ఉంది. కంగ్రాట్స్ శ్రీలంక' అంటూ పేర్కొన్నాడు.

లంకేయులకు ఊరటనిచ్చే విజయం
కొన్నాళ్లుగా శ్రీలంక విపరీతమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలాగే రాజకీయపరమైన సంక్షోభం కూడా తలెత్తింది. ఈ క్రమంలో ధరలు అమాంతం పెరగడం, అలాగే పెట్రోల్, కనీస అవసరాలు కూడా దొరకక ప్రజలు అల్లాడిపోయారు. ఈ దుర్భిక్ష సమయంలో శ్రీలంక దేశ ప్రజలకు ఊరటనిచ్చింది ఆ దేశ క్రికెట్ జట్టు. అనూహ్యంగా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచి వాహ్వా అనిపించిన ఆ జట్టు.. తర్వాత టెస్టుల్లో కూడా సిరీస్ సమం చేసి భళా అనిపించింది. ఆ తర్వాత పాకిస్థాన్, ఇండియా లాంటి దునర్భేద్య టీంలు పాల్గొన్న ఆసియాకప్ టోర్నీలో సత్తా చాటుతూ ఎవరీ అంచనాలకు అందని విధంగా ఏకంగా ట్రోఫీ గెలుచుకుంది. ఈ విజయం సంక్షోభ శ్రీలంక ప్రజలకు గొప్ప ఊరటగా మిగలనుంది. అలాగే కొన్నేళ్లుగా డీలా పడ్డ శ్రీలంక క్రికెట్ మళ్లీ పునరుత్తేజం పొందడానికి ప్రేరణగా మారనుంది.
జరగాల్సింది శ్రీలంకలోనే కాకపోతే..
ఇకపోతే అసలు ఈ ఆసియాకప్ టోర్నీ శ్రీలంకలో జరగాల్సింది. ఇక రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిర్వహించడానికి వీలు పడలేదు. ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా తాము నిర్వహించలేమని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి తెలియజెప్పింది. ఇక ఏసీసీ పెద్దలు చర్చించి యూఏఈలో నిర్వహించడానికి నిర్ణయించారు. అలా లంకలో జరగాల్సిన టోర్నీ.. యూఏఈలో జరిగింది. కెప్టెన్ దసున్ షనక సైతం.. ఈ టోర్నీ మా దేశంలో జరగాల్సింది.. మా దేశ ప్రజలకు ఈ టోర్నీని అందించాలనుకున్నాం.. అది యూఏఈలో జరుగుతుంది అయినా గెలిచేందుకే వచ్చామని టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల టైంలో చెప్పిన సంగతి తెలిసిందే.
బ్యాటింగ్లో రాజపక్స, బౌలింగ్లో హసరంగా, ప్రమోద్
ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్లో రాజపక్స్ (71నాటౌట్), బౌలింగ్లో పేసర్ ప్రమోద్ మదుషన్ (4 ఓవర్లలో 4/34), లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ (4 ఓవర్లలో 3/27) చెలరేగారు. దీంతో పాకిస్థాన్ 23పరుగుల తేడాతో ఓటమిపాలయింది. ఒకానొక దశలో 2వికెట్ల నష్టానికి పాక్ 93పరుగులతో ఉంది. అయితే వీరిద్దరు అనూహ్యంగా చెలరేగడంతో పాకిస్థాన్ 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌కు 24వేల మంది ప్రేక్షకులు హాజరుకాగా.. అందులో 20,000 మందికి పైగా పాకిస్తాన్ అభిమానులే ఉన్నారు. ఈ శ్రీలంక అభిమానుల కేకలు ఆ 20,000మంది కన్నా హోరెత్తించేలా అరిచారు. లంక ఫ్యాన్స్‌కు ఉన్నట్టి గెలుపు పిపాస ఎంతటిదో ప్రేక్షక గుణం చూపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications