గంభీర్ 2019 ప్రపంచ XI జట్టు: ధోనీకి దక్కని చోటు.. ఊహించని వారికి చోటు!!

ఢిల్లీ: మరో ఆరు రోజుల్లో 2019 ఏడాది ముగియనుంది. ఈ ఏడాది కొన్ని క్రికెట్ జట్లకు బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా క్రికెట్ పుట్టినల్లైన ఇంగ్లాండ్‌కు. ఉత్కంఠ ప్రపంచకప్ ఫైనల్లో అనూహ్యంగా విజయం సాధించి తొలిసారి కప్ కైవసం చేసుకుంది. ఇక జోఫ్రా ఆర్చర్, మొహమ్మద్ షమీ, కాగిసో రబడ, ఫ్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్లు సత్తాచాటగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, బెన్‌స్టోక్స్ లాంటి బ్యాట్స్‌మన్ పరుగుల ప్రవాహం సృష్టించారు. ఇలా మొత్తానికి ఈ ఏడాది అభిమానులను బాగానే అలరించింది.

కెప్టెన్‌గా విలియమ్సన్:
2020లోకి అడుగుపెడుతున్న సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ 2019గాను తన ప్రపంచ XI జట్టును ప్రకటించాడు. అయితే గంభీర్ తన జట్టులో కొందరు అర్హులైన ఆటగాళ్లకు చిటివ్వగా.. ఊహించని వారికి చోటివ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు భారత జట్టును ముందుండి నడిపిస్తున్న విరాట్ కోహ్లీని కాదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించాడు.

ఊహించని వారికి చోటు:
గంభీర్ తన జట్టుకు టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ, కివీస్ క్రికెటర్ లామ్ లాథమ్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీని కాదని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మూడో స్థానంలో చోటిచ్చాడు. కోహ్లీని నాలుగో స్థానంను ఇచ్చాడు. ఆ తర్వాత విలియమ్సన్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక గంభీర్ తన జట్టులో రెండు స్థానాలకు ఊహించని వారికి చోటు కల్పించాడు. అమెజాన్ ప్రైమ్ రూపొందించిన 'ఇన్‌సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్‌లోని అరవింద్ వశిష్ట్, వేయు రాఘవన్‌ను తీసుకున్నాడు.

ధోనీకి దక్కని చోటు:
ఆల్‌రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, ప్యాట్ కమిన్స్‌కు అవకాశం ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా, నేథన్ లైయన్ బౌలర్లు. అయితే గంభీర్ తన జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చోటు లేకపోవడం గమనార్హం. వికెట్ కీపర్ స్థానంలో ధోనీని కాదని లాథమ్‌ను ఎంచుకున్నాడు. ఇవన్ని పక్కన పెడితే వశిష్ట్, రాఘవన్‌లను తీసుకోవడమే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

గంభీర్ ప్రపంచ XI
రోహిత్ శర్మ, టామ్ లేథమ్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అరవింద్ వశిష్ట్, బెన్‌స్టోక్స్, కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా, నేథన్ లైయన్, వేయు రాఘవన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications