ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన గంభీర్.. శాంసన్‌కు చోటు

మే 30న ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీంతో ఈ మెగా టోర్నీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్ కోసం వెళ్లే జట్టు ఎంపికపై ఇప్పటికే అన్ని జట్ల బోర్డులు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అన్నికంటే ముందుగా ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును న్యూజిలాండ్ బోర్డు ప్రకటించింది.
అయితే 15 మందితో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ముంబై వేదికగా సోమవారం ప్రకటించనుంది. బీసీసీఐ అధికారులు జట్టులోకి ఎవరిని ఎంపిక చేస్తారా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రపంచకప్ కోసం వెళ్లే తన కలల జట్టును ప్రకటించాడు.

నం.4 స్థానంలో సంజూ శాంసన్:
అందరూ అనుకుంటున్నట్టుగా ప్రపంచకప్‌లో ఆడే చాలా మంది ఆటగాళ్లకు గంభీర్ తన జట్టులో చోటిచ్చాడు. టీంఇండియా నం.4 స్థానంపై ఎప్పటినుండో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు చాలా రోజులుగా కసరత్తులు చేశారు. అయితే ఈ స్థానంకు ప్రధాన పోటీ దారులుగా ఉన్న అంబటి రాయుడు, అంజిక్య రహానేలను కాదని యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు గంభీర్ స్థానం కల్పించాడు.

అశ్విన్‌కు చోటు:
ఇక రేసులో లేని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు జట్టులో చోటిచ్చాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ నాలుగు పేసర్ గా నవదీప్ సైనీకి ఓటు వేశాడు. కేఎల్ రాహుల్‌ను రిజర్వు ఓపెనర్ గా తీసుకున్నట్టున్నాడు. ప్రపంచకప్ జట్టులో చోటు ఆశిస్తున్న రిషబ్ పంత్, జడేజా, కార్తీక్ లాంటి ఆటగాళ్లకు గంభీర్ తన జట్టులో చోటు కల్పించలేదు.

గంబీర్ జట్టు ఇదే :
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సంజూ శాంసన్, కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications