గౌతమ్ గంభీర్ సెకెండ్ ఇన్నింగ్: లోక్‌సభ సభ్యునిగా ప్రమాణం

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన సెకెండ్ ఇన్నింగ్‌ను ఆరంభించారు లోక్‌సభ సభ్యునిగా. సోమవారం ఆయన లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్న తరువాత ఆయన రాజకీయాల్లో చేరారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు భారతీయ జనతాపార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీపై గౌతమ్ గంభీర్ సుమారు మూడు లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజాగా- 17వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం ఆరంభమైంది. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ సభ్యునిగా ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తెల్లటి కుర్తా, పైజామాతో కనిపించారు గౌతమ్.
క్రికెటర్‌గా పలు రికార్డులను ఆయన నెలకొల్పిన విషయం తెలిసిందే. 2011 నాటి ప్రపంచకప్‌ను సాధించిన భారత జట్టు సభ్యుడు కూడా. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా గంభీర్ 97 పరుగులను సాధించారు. కేరీర్ మొత్తంలో 147 వన్డేలు, 58 టెస్ట్‌మ్యాచ్‌లను ఆడారు. 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించారు. తొమ్మిది వేలకు పైగా పరుగులను తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహించారు. గంభీర్ నేతృత్వంలో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications