Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir : పెద్ద తలకాయ గంగూలీ మారితే.. మిగతావాళ్లు మారతారు, లేకుంటే ఎవరైనా అంతే

Gautam Gambhir Opined that The change Should Come From Ganguly about Fantasy Gaming Apps

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ వ్యక్తి అని తెలిసిందే. ఏ మాట అయినా నిర్భయంగా అనేసే రకం అతను. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కూడా విమర్శించడానికి గంభీర్ వెనుకాడలేదు. అసలు విషయమేంటంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎక్కువ స్పాన్సర్‌షిప్ డబ్బు ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫాంలు అయిన డ్రీమ్ 11, మై లెవన్ సర్కిల్ తదితర వెబ్ సైట్ల నుంచి వస్తుందని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలే ఈ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను దగ్గరుండి అడ్వర్టైజ్ చేస్తుంటే.. ఇతర ప్లేయర్లు వీటిని అడ్వర్టైజ్ చేయకుండా ఉంటారా.. అది కాని పని అని గంభీర్ తెలిపాడు.

'బీసీసీఐ అధ్యక్షుడుగా పనిచేస్తున్న గంగూలీ వీటికి అడ్వర్టైజ్ చేస్తుంటే... మిగతా ఆటగాళ్లు ఎందుకు చేయరు.. తప్పకుండా చేస్తారు. ఇలాంటి ఫాంటసీ గేమ్‌లను ప్రోత్సహించడం ద్వారా కొందరికి మేలు జరుగుతుంటే.. లక్షలమంది తమ హార్డ్ ఎర్నింగ్ మనీని కోల్పోతున్నారు. ఒకవేళ పెద్దవాళ్లు వీటికి అడ్వర్టైజ్ చేయొద్దని చెబితే గంగూలీతో సహా అందరూ దానిని పాటించాలి. ఆ మార్పు పై నుండి రావాలి. లేదా భారతదేశంలో వీటిని పూర్తిగా నిషేధించాలి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసి.. ఇంకొన్ని రాష్ట్రాల్లో నడిపిస్తే ఎలా. వద్దంటే అంతటా వద్దనేలా ఉండాలి.' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గంభీర్ అన్నాడు.

'ఐపీఎల్‌లో డ్రీమ్ 11 వంటి ఫాంటసీ లీగ్ గేమ్‌ నిర్వాహకుల నుంచి పెద్ద పెద్ద స్పాన్సర్‌షిప్‌లు వస్తున్నాయి. అయితే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలా లేదా అనేది బీసీసీఐ పెద్దలు సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. గత కొంతకాలంగా Dream11, MPL, My 11 సర్కిల్ వంటి ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తదితర ప్రముఖ ఆటగాళ్లు అడ్వర్టైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాట్‌ఫారమ్‌లు మిలియన్ల కొద్దీ అభిమానుల ఎంగేజ్‌మెంట్‌లను సృష్టించడంలో విజయవంతమయ్యాయి. అయితే వీటిని కొన్ని రాష్ట్రాలను నిబంధనల రీత్యా బ్యాన్ చేశాయి.

Story first published: Tuesday, September 20, 2022, 9:29 [IST]
Other articles published on Sep 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+