For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా గంభీర్, ఐపీఎల్ 11వ సీజన్ (కెప్టెన్లు8)

Gautam Gambhir named Delhi Daredevils captain

హైదరాబాద్: ఐపీఎల్ 11 సీజన్‌కు పాల్గొననున్న ఎనిమిది జట్లకు కెప్టెన్లు ఖరారైయ్యారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్‌గా గౌతం గంభీర్‌ను ఎంచుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తి అయింది. గతంలో మూడు సీజన్ల పాటు గంభీర్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని ఢిల్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ దువా బుధవారం వెల్లడించారు. దీంతోపాటు జట్టుకు సంబంధించిన జెర్సీని కూడా ఆవిష్కరించారు. ఐపీఎల్ 2017 వరకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు ఆడి రెండు (2012&2014) టైటిళ్లు సంపాదించిపెట్టాడు. కోల్‌కత్తా జట్టు తీసుకున్న నిర్ణయం మేరకు గౌతం గంభీర్ జట్టును వదిలేయాల్సి వచ్చింది.

కోల్‌కత్తా జట్టు గంభీర్‌ను వదిలేసి తిరిగి వేలంలో సొంతం చేసుకోవాలని యోచించడంతో దానికి గంభీర్ నిరాకరించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సొంతగడ్డకు ఆడాలని ఉందని గంభీర్‌ చెప్పాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు గంభీర్‌ను జనవరిలో నిర్వహించిన వేలంలో రూ.2.8 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఢిల్లీకి ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన పాంటింగ్.. 'జట్టులో ఉన్న యువ క్రికెటర్లకు అనుభవమున్న నాయకుడు కావాలని గంభీర్‌ను ఎంచుకున్నాం. అతని నాయకత్వంలో జట్టు కచ్చితంగా టైటిల్ సాధిస్తుందనే నమ్మకంగా ఉంది' అని వివరించారు.

ఎనిమిది జట్ల కెప్టెన్లు:
1. చెన్నై సూపర్ కింగ్ - మహేంద్ర సింగ్ ధోనీ
2. ఢిల్లీ డేర్ డెవిల్స్ - గౌతం గంభీర్
3. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - రవిచంద్రన్ అశ్విన్
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - విరాట్ కోహ్లీ
5. ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ
6. సన్‌రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్
7. కోల్‌కతా నైట్ రైడర్స్ - దినేశ్ కార్తీక్
8. రాజస్థాన్ రాయల్స్ - స్టీవ్ స్మిత్

Story first published: Wednesday, March 7, 2018, 15:23 [IST]
Other articles published on Mar 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+