మూడు ఫార్మాట్లకు గంభీర్ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదీ!


హైదరాబాద్: దశాబ్దంన్నర పాటు అభిమానులను అలరించిన టీమిండియా వెటనర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా విమర్శకుల మాటకు తలొగ్గుతూ క్రికెట్ ఆడుతోన్న గంభీర్ మంగళవారం అనూహ్యంగా తన వీడ్కోలు నిర్ణయాన్ని వెల్లడించాడు.
దాదాపు 11నిమిషాల నిడివి కలిగిన వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌చేస్తూ 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గురువారం నుంచి ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఆంధ్రతో మొదలయ్యే రంజీ మ్యాచ్ తనకు చివరిదని అందులో పేర్కొన్నాడు. 2003లో ఢాకాలో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన గంభీర్ జాతీయ జట్టుకు ఎనలేని సేవలు అందించాడు.

భారత్‌కు చిరస్మరణీయ విజయాలు
మూడు ఫార్మాట్లలో భారత్ తరుపున అనేక చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నాడు. 2009లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన గంభీర్.. 2016లో ఇంగ్లాండ్‌పై రాజ్‌కోట్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తరుపున ఆడే అవకాశం గంభీర్‌కు లభించలేదు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండుసార్లు విజేతగా నిలుపడంలో గంభీర్‌ది కీలకపాత్ర.

రాజకీయాల్లో వచ్చేందుకే
అయితే, రాజకీయాల్లో వచ్చేందుకే గంభీర్ మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా గంభీర్ రాజకీయపరమైన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సైనికులు, వారి సంక్షేమం వంటి అంశాల్లో గంభీర్ ఏదో ఒకరూపంలో పాలుపంచుకుంటున్నాడు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరుపున!
దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గంభీర్ బీజేపీ సీటును ఆశిస్తున్నట్లు కూడా ఇటీవలే వార్తలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై గంభీర్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 2019 ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి ముందే ఢిల్లీ ప్రాంఛైజీ గంభీర్‌ని విడుదల చేసింది.
వేలానికి ముందే విడుదల చేసిన ఢిల్లీ
దీంతో 2019 ఐపీఎస్ సీజన్ కోసం మళ్లీ ఏదైనా ఫ్రాంచైజీ గంభీర్‌ను ఎంచుకునే అవకాశాలు దాదాపుగా లేవు. మరోవైపు గాయం కారణంగా ఈ మధ్యకాలంలో ఢిల్లీ రంజీ మ్యాచ్‌లకు గంభీర్ దూరంగా ఉన్నాడు. ఇది కూడా అతడిపై విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications