Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ, రోహిత్ కాదు.. అతనే భారత క్రికెట్‌లో చక్రవర్తి: గంభీర్

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన ఫేవరేట్ ప్లేయర్ల గురించి వివరించాడు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లను కాదని.. భారత క్రికెట్‌లో కోహ్లి చక్రవర్తి అని పేర్కొన్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌కు హాజరైన గంభీర్ యాంకర్ షెఫాలీ బగ్గా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.

అయితే ఈ ప్రశ్నలన్ని బాలీవుడ్‌ X క్రికెట్‌కు సంబంధించినవి. కోహ్లితో పాటు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌కు కూడా గంభీర్ బిరుదులు ఇచ్చాడు. గంభీర్‌తో పాటు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ కూడా ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

Gautam Gambhir Labels This Indian Player Shahenshah Not Dhoni or Rohit Watch Here

షెఫాలీ: 'బాద్‌షా ఆఫ్ క్రికెట్ ' ఎవరు?
గంభీర్: యువరాజ్ సింగ్
షెఫాలీ: యాంగ్రీ యంగ్ మన్ ఎవరు?
గంభీర్: అది నేనే
షెఫాలీ: 'దబాంగ్' టైటిల్ ఎవరికి?
గంభీర్: సచిన్ టెండూల్కర్

షెఫాలీ: 'షెహెన్‌షా' (చక్రవర్తి) ఎవరు?
గంభీర్: విరాట్ కోహ్లి
షెఫాలీ: 'కిలాడీ' టైటిల్ ఎవరికి ఇస్తారు?
గంభీర్: జస్‌ప్రీత్ బుమ్రా
షెఫాలీ: మిస్టర్ పర్‌ఫెక్ట్, గబ్బర్, టైగర్ ఎవరు?
గంభీర్: రాహుల్ ద్రవిడ్, శిఖర్ ధావన్, సౌరవ్ గంగూలీ.

షెహెన్‌షా ఎవరు అని అడిగినప్పుడు గంభీర్ మిగతా ప్రశ్నల కంటే సుదీర్ఘంగా ఆలోచించడం గమనార్హం. కాసేపు ఆలోచించిన గంభీర్ కోహ్లి పేరు చెప్పాడు. ఐపీఎల్‌లో గంభీర్-కోహ్లి పలు సందర్భాల్లో గొడవ పడిన విషయం తెలిసిందే. 2023 సీజన్‌లో ఒకరిపైనొకరు దూసుకెళ్లారు. టీమిండియా కోచ్‌గా గంభీర్ బాధ్యతలు అందుకున్న అనంతరం వీరిద్దరు సరదాగా కలిసిపోయారు.

కాగా, బిగ్‌బీ అమితాబ్ బచన్ నటించిన షాహెన్‌షా 1988లో రిలీజ్ అయ్యింది. ఇది అత్యంత విజయవంతమైంది. షాహెన్‌షా పర్షియన్ పదం. దీనికి అర్థం రాజులకు రాజు, చక్రవర్తి. అమితాబ్ షెహెన్‌షా సినిమా నటించిన తర్వాత ఆయనకు ఈ టైటిల్ బిరుదుగా మారింది. అమితాబ్‌ను బాలీవుడ్ షాహెన్‌షా అని అంటుంటారు.

ఇక ఈ ప్రశ్నలకు శిఖర్ ధావన్ ఇతర ప్లేయర్ల పేర్లను సమాధానంగా ఇచ్చాడు. బాద్‌షా ఆఫ్ క్రికెట్- విరాట్ కోహ్లి, యాంగ్రీ యంగ్ మన్- సిరాజ్, దబాంగ్-హార్దిక్, షెహన్‌షా-బుమ్రా, ఖిలాడి- శుభ్‌మన్, మిస్టర్ పర్‌ఫెక్ట్- సచిన్ టెండూల్కర్, టైగర్- సూర్యకుమార్ యాదవ్ అని ధావన్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, September 12, 2024, 11:30 [IST]
Other articles published on Sep 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+