Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ ఎంట్రీ.. బీసీసీఐ నుంచి తప్పుకుంటున్న జై షా: పెద్ద ప్లానే ఇదీ!

టీ20 వరల్డ్ కప్-2024 అనంతరం భారత క్రికెట్‌లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా టీ20లకు గుడ్‌బై చెప్పారు. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వీడ్కోలు పలికాడు. ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు. సీనియర్ల స్థానంలో క్రమంగా యువ ఆటగాళ్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకుంటున్నారు.

మరోవైపు బీసీసీఐ సెక్రటరీ జై షా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష పదవిని సౌరవ్ గంగూలీ చేపట్టినప్పటి నుంచి జై షా కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. 2022లో అధ్యక్ష పదవి నుంచి దాదా తప్పుకున్నాడు. అతని స్థానంలో వచ్చిన రోజర్ బిన్నీ స్థానంలోనూ జై షా కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Gautam Gambhir Joins as Team India Coach Jay Shah to Leave BCCI Amid Major Changes

గంగూలీ-జై షా కాంబినేషన్‌లో భారత్ ప్రపంచ క్రికెట్‌లో మరింత శక్తివంతంగా మారింది. బీసీసీఐ రాజ్యాంగ నిబంధనల కారణంగా దాదా తప్పుకున్నప్పటికీ అదే ఆరాను జై షా కొనసాగిస్తున్నాడు. ప్రపంచ క్రికెట్‌ను శాసించేలా బీసీసీఐ చేరుకుంది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి వరుసగా ఆరు సంవత్సరాలకు మించి పనిచేయడానికి వీళ్లేదు. విరామం తర్వాత తిరిగి బాధ్యతలు అందుకోవచ్చు.

అయితే దీన్ని దృష్టిలో ఉంచుకునే గంభీర్‌ను టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమించడానికి జైషా తీవ్రంగా ప్రయత్నించాడని జాతీయ మీడియా పేర్కొంది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. బీసీసీఐ నిబంధనలతో 2025లో కార్యదర్శి పదవికి జై షా రాజీనామా చేయాల్సి ఉంది. ఈ సమయంలో ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు అందుకుంటాడు.

ఐసీసీలో తాను చక్రం తిప్పే సమయంలో, బీసీసీఐని గంభీర్ అయితే సమర్థవంతంగా నిర్వర్తిస్తాడనే జై షా ముందుగా ఉద్దేశించాడు. అందుకే కోచ్‌గా గంభీర్ నియామకంతో జై షా చొరవ తీసుకున్నాడు. అంతేగాక గంభీర్, జై షా తండ్రి అమిత్ షా ఇద్దరూ బీజేపీకి చెందినవాళ్లే. ఇది కూడా ప్రణాళికలో ఓ కారణమని జాతీయ మీడియా రాసుకొచ్చింది. అయితే ఐసీసీ ఛైర్మన్‌ పదవిని జై షా అందుకుంటాడా లేదా అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది.

Story first published: Thursday, July 18, 2024, 15:42 [IST]
Other articles published on Jul 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+