Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండుతో టెస్ట్‌లకు టీమిండియా ఎంపిక, గంభీర్‌కు ఛాన్స్, పాండ్యాకు తొలిసారి

ముంబై: ఇంగ్లాండుతో తొలి రెండు టెస్టులకు భారత జట్టును ఎంపిక చేశారు. టెస్ట్ జట్టులో హార్దిక్ పాండ్యాకు తొలిసారి అవకాశం దక్కింది. అలాగే గౌతమ్ గంభీర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాహుల్‌లకు గాయాల కారణంగా చోటు దక్కలేదు.

Gautam Gambhir, Ishant Sharma for England Tests

ఎంపికైన ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, ఛటేశ్వర పుజారా, హార్దిక్ పాండ్యా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడెజా, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా,క మొహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, గౌతమ్ గంభీర్‌లు ఎంపికయ్యారు.

కోహ్లి సారథ్యంలో ఈ 15 మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గౌతమ్‌ గంభీర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మలు ఒక్కో మ్యాచ్ ఆడారు.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్

నవంబర్ 9-13 - తొలి టెస్ట్ - రాజ్‌కోట్
నవంబర్ 17-21 - రెండో టెస్ట్ - విశాఖ
నవంబర్ 26-30 - మూడో టెస్ట్ - మొహాలి
డిసెంబర్ 8-12 - నాలుగో టెస్ట్ - ముంబై
డిసెంబర్ 16-20 - అయిదో టెస్ట్ - చెన్నై

మూడు వన్డేల సిరీస్

జనవరి 15 - తొలి వన్డే - పుణే
జనవరి 19 - రెండో వన్డే - కటక్
జనవరి 22 - మూడో వన్డే - కోల్‌కతా

మూడు ట్వంటీ 20ల సిరీస్

జనవరి 26 - తొలి ట్వంటీ 20 - కాన్పూర్
జనవరి 29 - రెండో ట్వంటీ 20 - నాగపూర్
ఫిబ్రవరి 1 - మూడో ట్వంటీ 20 - బెంగళూరు

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+