Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంపీ పదవికి రాజీనామా చేస్తేనే!: డీడీసీఏ అధ్యక్షుడిగా గంభీర్ ఎంపికలో కొత్త ట్విస్ట్!

Gautam Gambhir is not eligible to contest for President’s post: DDCA

హైదరాబాద్: ఢిల్లీ & డిస్ట్రిక్‌ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే గంభీర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డీడీసీఏ ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారా తెలిపారు. డీడీసీఏ అధ్యక్షుడిగా రజత్ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవికి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.

ఇటీవల జరిగిన డీడీసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక వర్గం సభ్యులు ఓ ప్రతిపదనను తీసుకురాగా దాన్ని మరోవర్గం వారు వ్యతిరేకించారు. దీంతో డీడీసీఏ సంయుక్త కార్యదర్శి రాజన్‌ మంచందతో పాటు మరికొందరు సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీడీసీఏను రద్దు చేయాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని ట్విట్టర్ వేదికగా కోరాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెంటనే చర్యలు తీసుకొని, డీడీసీఏను రద్దు చేయాలని గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అనంతరం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌ను గాడిన పెట్టేందుకు అధ్యక్షుడిగా బాధ్యతలను గంభీర్‌కు ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీడీసీఏ ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారా మాట్లాడుతూ "జనవరి ఆఖరిలో డీడీసీఏ ఎన్నికలు జరగాలి. కానీ ఫిబ్రవరిలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత నిర్వహించాలని అంబుడ్స్‌మన్ దీపక్‌ వర్మ కోరారు" అని అన్నారు.

"అయితే, గంభీర్‌ డీడీసీఏకి సేవలు చేయాలని భావిస్తే అతడికి స్వాగతం పలుకుతాం. కానీ అధ్యక్షుడిగా అతడు బాధ్యతలు నిర్వహించాలంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. సర్వసభ్య వార్షిక సమావేశంలో ఘర్షణకు దిగిన వారిపై వారంలోపు కఠిన చర్యలు తీసుకుంటాం" అని వినోద్‌ తిహారా చెప్పుకొచ్చారు.

మరోవైపు జనవరి 13లోపు డీడీసీఏకు నూతన అధ్యక్షుడ్ని ఎన్నుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ పదవికి గంభీరే అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు. అధ్యక్ష పదవిని గంభీర్ చేపడితే డీడీసీఏ గాడినపడుతుందని చెప్పుకొచ్చారు. "ఐపీఎల్‌లో కేకేఆర్ యొక్క అదృష్టాన్ని మార్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీ క్రికెట్‌కు గంభీర్ చేసిన సహకారాన్ని మర్చిపోకూడదు. నాయకత్వ లక్షణాలతో పాటు నిర్వాహకుడిగా మారిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆకట్టుకోవడాన్ని మనం చూశాం, ఈ సమయంలో డీడీసీఏ పగ్గాలు చేపట్టడానికి గంభీర్ సరైన వ్యక్తి" అని అన్నాడు.

"నిన్నటి గొడవ తర్వాత కొంతమంది బీజేపీ అఫీసియల్స్ ఈ మధ్య కాలంలో అసోసియేషన్‌లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి గంభీర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. నిన్నటి ఘటన తర్వాత అతనిలాంటి కఠినమైన టాస్క్‌మాస్టర్ బాధ్యతలు స్వీకరించి అసోసియేషన్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురాగలడు. అవును, మేము ఇప్పటివరకు జరిపిన చర్చలపై అతడు కూడా ఆసక్తి చూపించాడు. కొత్త సంవత్సరంలో అతనితో మరో సమావేశం జరుగుతుందని భావిస్తున్నాం" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Story first published: Tuesday, December 31, 2019, 15:57 [IST]
Other articles published on Dec 31, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+