Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఏసీ సభ్యుడిగా గంభీర్‌ అనర్హుడు.. కారణం ఇదేనా?!!

Gautam Gambhir Ineligible to Become CAC Member

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) సీజన్‌-13లోని మ్యాచ్‌ల సమయం, పూర్తి షెడ్యూల్‌పై ఐపీఎల్ పాలక మండలి సోమవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్ పాలక మండలి సభ్యులతో పాటు బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా కూడా పాల్గొననున్నారు. ఈ భేటీ అనంతరం క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులను బీసీసీఐ సభ్యులు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.

గంభీర్‌కు నో ఛాన్స్‌

గంభీర్‌కు నో ఛాన్స్‌

మాజీ క్రికెటర్లు మదన్‌ లాల్‌, గౌతం గంభీర్‌, సులక్షణా నాయక్‌లను సీఏసీ సభ్యులుగా నియమించే అవకాశం ఉందని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొందరు బీసీసీఐ అధికారులు వీరి నియామకం తప్పనిసరి అని కూడా గతంలో చెప్పారు. అయితే లోథా కమిటీ నిబంధనల ప్రకారం.. గంభీర్‌, సులక్షణాలకు సీఏసీ సభ్యులుగా నియమితులయ్యే అవకాశం లేదని సమాచారం తెలుస్తోంది.

5 సంవత్సరాలు క్రికెట్‌కు దూరంగా ఉండాలి

5 సంవత్సరాలు క్రికెట్‌కు దూరంగా ఉండాలి

గంభీర్‌, సులక్షణాళ్లు 2018-19లోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. సీఏసీ సభ్యులుగా ఉండాలంటే.. కనీసం ఐదు సంవత్సరాలు క్రికెట్‌కు దూరంగా ఉండాలి. గంభీర్‌ 2016లో చివరి టెస్ట్ ఆడగా.. సులక్షణా 2018-19లో దేశవాళీ క్రికెట్‌ ఆడారు. మరోవైపు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విరుద్ధ ప్రయోజనాలు లేని మాజీ క్రికెటర్లనే సీఏసీ సభ్యులుగా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే సీఏసీ సభ్యుడిగా గంభీర్‌ నియమితులయ్యే అవకాశం ఉండదు.

పలు కీలక నిర్ణయాలు:

పలు కీలక నిర్ణయాలు:

స్పాన్సర్స్, ప్రాంచైజీల నుండి వస్తున్న డిమాండ్ల మేరకు ఈ రోజు జరిగే సమావేశంలో ఐపీఎల్‌ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌లను రాత్రి 7.30కు ప్రారంభించేలా, వారం చివరి రోజుల్లో ఒకే మ్యాచ్‌ను నిర్వహించేలా నిర్ణయాలను తీసుకోనుందని సమాచారం తెలుస్తోంది. ఇక ఐపీఎల్‌ ఫైనల్‌కు, టీమిండియా తలపడే తర్వాతి సిరీస్‌కు మధ్యలో కనీసం 15 రోజులు ఉండే విధంగా షెడ్యూల్‌ రూపొందించనుంది. ఏదేమైనా ఈ రోజు అన్ని విషయాలలో ఓ స్పష్టత రానుంది.

మొదటి సీఏసీలో దిగ్గజాలు:

మొదటి సీఏసీలో దిగ్గజాలు:

2015లో మొదటి సీఏసీ సభ్యులుగా మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్,వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలు నియమితులయ్యారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి రావడంతో ఈ ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేసారు. ఆపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ చైర్మన్‌గా తాత్కాలిక ప్యానల్‌ను నియమించారు. వారు కూడా రాజీనామా చేసారు. అయితే రాజీనామానికి ముందు రవిశాస్త్రిని టీమిండియా ప్రధాన కోచ్‌గా కపిల్ ప్యానెల్ తిరిగి నియమించింది. జాతీయ సెలక్షన్‌ కమిటీ సభ్యులను సీఏసీ ఎంపిక చేస్తోంది.

Story first published: Monday, January 27, 2020, 14:09 [IST]
Other articles published on Jan 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+