న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్రిది విమర్శలపై గౌతం గంభీర్ ఘాటు కౌంటర్...

Gautam Gambhir Serious Comments On Shahid Afridi || Oneindia Telugu
Gautam Gambhir hits back at Shahid Afridi; advises him to visit a psychiatrist

తన గేమ్ చేంజర్‌ ఆత్మకథలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిది తనఫై చేసిన విమర్శలపై గౌతం గంభీర్ తీవ్రంగా స్పందించారు. 'అఫ్రిది, మీరు హిల్లెరియస్ వ్యక్తి. ఎనీవే, మేం ఇప్పుడు కూడా పాకిస్తానీలకు మెడికల్ వీసాలు ఇస్తున్నాం. నేను వ్యక్తిగతంగా నిన్ను సైక్రియాటిస్టుల వద్దకు తీసుకువెళ్తాన'ని గంభీర్ ట్వీట్ చేసాడు. అఫ్రిది గేమ్ చేంజర్‌ పేరుతో ఆత్మకథ బుక్ ను ఏప్రిల్ ౩౦న తీసుకువచ్చాడు. ఇందులో చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయి. గంభీర్ పై కూడా విమ్మర్శల వర్షం కురిపించాడు.

పొగరు మాత్రమే ఉండేది:

పొగరు మాత్రమే ఉండేది:

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిది తన ఆత్మకథలో గౌతం గంభీర్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. గంభీర్ కు గొప్ప రికార్డ్స్ ఏమిలేవని, కానీ గొప్ప ఆటిట్యూడ్ ఉందని ఎద్దేవా చేసాడు. అతనికి చాలా పొగరు మాత్రమే ఉందని, అటలో చెప్పుకోవడానికి ఏమి లేవని వ్యాఖ్యానించాడు. అతనిని చూస్తే జాలి కలుగుతుందని, అతని ఆటిట్యూడ్ లో ప్రాబ్లం ఉందన్నాడు. కొన్ని గొడవలు పర్సనల్ గా ఉంటాయని, మరికొన్ని అట వరకే పరిమితం అవుతాయని చెప్పాడు.

వ్యక్తిత్వం లేని వ్యక్తి గంభీర్:

వ్యక్తిత్వం లేని వ్యక్తి గంభీర్:

క్రికెట్ లో తనకంటూ వ్యక్తిత్వం లేని వ్యక్తి గంభీర్ అని అఫ్రిది అన్నాడు. బ్రాడ్‌మన్‌, జేమ్స్‌ బాండ్‌ కలిస్తే తాను అన్నట్లుగా ప్రవర్తిస్తాడని, కరాచిలో అలాంటి వాళ్ళను పొగరుబోతని అంటూ ఉంటామని, ఆటలో దూకుడు తప్పులేదని, పోటీతత్వం ప్రదర్శించవచ్చునని అన్నాడు. కానీ సానుకూల ధోరణి ఎంతో అవసరం అన్నాడు. కానీ గంభీర్ అలాంటి వాడు కాదన్నాడు.

గంభీర్‌తో గొడవ గుర్తుంది:

గంభీర్‌తో గొడవ గుర్తుంది:

అఫ్రిది గేమ్ చేంజర్‌ పేరుతో ఆత్మకథ బుక్ ను ఏప్రిల్ ౩౦న తీసుకువచ్చాడు. ఇందులో చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయి. పన్నెండేళ్ళ క్రితం (2007) ఆసియా కప్ సందర్భంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు వీరు ఒకరిపైకి మరొకరు దూసుకెళ్ళారు. ఈ అంశంపై కూడా అఫ్రిది పుస్తకంలో పేర్కొన్నాడు. గంభీర్‌తో గొడవ తనకు గుర్తుకు ఉందని, సింగిల్‌ పూర్తి చేసి తన మీదకి దూసుకొచ్చాడని, అంపైర్లు జోక్యం చేసుకోకుంటే తానే ముగించేవాడినని చెప్పాడు.

Story first published: Saturday, May 4, 2019, 12:52 [IST]
Other articles published on May 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X